చంద్రమోహన్ ఎంతమంది హీరోయిన్స్ ని స్టార్స్ చేశారో తెలుసా..?

టాలీవుడ్ గొప్ప యాక్టర్లలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు.. ఈయన తనదైన స్టైల్ లో కామెడీతో నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఈరోజు ఉదయం చంద్రమోహన్ ను అపోలో ఆసుపత్రిలో చేర్పించగా 9:45 నిమిషాల సమయంలో మరణించినట్లుగా వైద్యులు తెలియజేయడం జరిగింది. దీంతో చంద్రమోహన్ కు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలా చంద్రమోహన్ కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్ పొజిషన్ లోకి తీసుకువచ్చారు వాటి గురించి తెలుసుకుందాం.

మొదట శ్రీదేవి అనురాగాలు అనే చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది కానీ 1978లో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాలు చంద్రమోహన్ కు జంటగా నటించి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రీదేవి కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. 1978లోని ప్రాణం ఖరీదు సినిమాలో చంద్రమోహన్ కు జంటగా జయసుధ నటించిన. అలా ఈమె కెరియర్ కూడా ఒక్కసారిగా తిరుగులేని నటిగా తెలుగు పరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది.


1983లో వచ్చిన పెళ్లిచూపులు చిత్రంతో విజయశాంతి చంద్ర మోహన్ నటించిన వీరి కాంబినేషన్లో వచ్చిన 1986లో ప్రతిఘటన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని విజయశాంతి కెరియర్లో మైలురాయిగా నిలిచింది. 1976 లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరిమువ్వ సినిమాలో చంద్రమోహన్ కు జంటగా జయప్రద నటించిన ఈ సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇలా ఎంతోమంది హీరోయిన్స్ ని సైతం తన సినిమాలో జంటగా నటించి స్టార్ పోసిషన్ కి తీసుకువచ్చిన చంద్రమోహన్ మాత్రం స్టార్ హీరోగా పేరు సంపాదించుకోలేకపోయారు. కానీ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.