రజినీకాంత్, రాజమౌళి కాంబో మిస్ అవడానికి కారణం ఇదేనా… బయటపడ్డ అసలు గుట్టు…!!

దర్శక ధీరుడు రాజమౌళి మనందరికీ సుపరిచితమే. ఈయనతో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు సైతం ఆశపడతారు. స్టార్ డైరెక్టర్లు లిస్ట్ తీస్తే ముందుగా రాజమౌళి ఉంటాడు. ఈయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సైతం సంపాదించుకున్నాడు రాజమౌళి. అయితే రజినీకాంత్ అప్పట్లో రాజమౌళితో ఓ సినిమా చేయాలని అనుకున్నారట.

కానీ అది పట్టాలెక్క లేకపోయింది. ర‌జనీకాంత్ చంద్రముఖి సినిమా తర్వాత తెలుగులో ఒక మూవీ చేయాలని అనుకున్నారు. అప్పుడు తెలుగులో వరుస హిట్లు కొట్టిన రాజమౌళితో సినిమా చేయాలని అనుకున్న కూడా ఆ ఆశ నెరవేరలేదట. రాజమౌళి వరుసగా యమదొంగ, మగధీర సినిమాలు కమిట్ అయి ఉండడంతో రజనీకాంత్ సినిమా చేయలేకపోయాడట.

రాజమౌళి కనుక రజినీకాంత్ సినిమా చేస్తే తప్పకుండా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి వరుస సినిమాలు తీస్తూ బిజీ అయిపోయాడు. మరి రానున్న కాలంలో రజనీకాంత్ తో ఈ దర్శకుడు సినిమా తీస్తాడో లేదో చూడాలి మరి.