టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడు . “గుంటూరు కారం” సినిమాకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది .
ప్రెసెంట్ డబ్బింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది మూవీ టీం . అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా వెరైటీగా చేయాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మొదట పలువురు గెస్ట్లతో అభిమానులతో రికార్డ్ చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేయబోతున్నారట . రీజన్స్ ఏంటో తెలియదు కానీ కూసింత డిఫరెంట్గా ఆలోచించే పద్ధతి ఇదే అంటూ త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడట .
ఇది ఒక అందుకు మంచిదే అయిన మరోకందుకు మాత్రం అభిమానులకు ఆ కిక్ ఇవ్వలేదు అంటూ చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు చేయని రేంజ్ లో ఈ ఫంక్షన్ చేయబోతున్నారట . ఈ ఫంక్షన్ లో మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ప్రైస్ కూడా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది..!!