అప్పుడు మహేశ్ ..ఇప్పుడు ఈ స్టార్ హీరో.. మీనాక్షి అంటే అంత పిచ్చి ఏంటి అయ్యా మీకు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అంతకు సమాన స్థాయిలో మారుమ్రోగిపోతుంది మీనాక్షి చౌదరి పేరు . నిన్న మొన్నటి వరకు ఈ బ్యూటీ గురించి పట్టించుకునే నాధుడే లేడు. అయితే మహేష్ బాబు సినిమాలో ఆఫర్ అందుకున్న తర్వాత అమ్మడి దశ తిరిగిపోయింది. ఎలా అంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు దూసుకుపోతుంది.

ఇప్పటికే చేతులో ఐదు బడా ప్రాజెక్టులు పట్టుకొని ఉంది . అది కాకుండా రీసెంట్గా మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . రష్మిక మందన్నా ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం బన్నీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాలో ఆయనతో నటించిన తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది . ఇప్పుడు అదే స్థానంలోకి వెళ్లబోతుంది మీనాక్షి అంటూ తెలుస్తుంది.

త్వరలోనే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్గా మీనాక్షి సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . త్రివిక్రమ్ కు ఒక్కసారి హీరోయిన్ నచ్చితే ఐదు-ఆరు సినిమాలకు వాడేస్తాడు . ప్రజెంట్ అదే లిస్టులోకి వచ్చేసింది మీనాక్షి. చూద్దాం ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఏ రేంజ్ లో మారిపోతుందో..?