ఆ స్టార్ హీరో చిత్రంతో రీ యంట్రీ ఇస్తున్న సిమ్రాన్..!!

అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యకాలంలో ఫెడౌట్ హీరోయిన్గా మారిపోయారు. ఇలాంటివారు ఎక్కువగా పలు చిత్రాలతో రీ యంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రన్ తాజాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఒక చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

డైరెక్టర్ ఎవరు అనే విషయం పైన ఇంకా తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ -2 రాబోతోంది.. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే రామ్ మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో తన స్టామినా ఏంటో చూపిస్తారని చెప్పవచ్చు. రామ్ చిత్రాలు వరుసగా ప్లాట్లు అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు ఇటీవల వచ్చిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.

ఇకమీదట హీరో రామ్ తన నటించిన ప్రతి సినిమా కూడా మాస్ పాత్రకి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటానని తెలియజేసినట్లు సమాచారం. ఒకప్పుడు రెడీ, దేవదాస్ వంటి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు నటించిన రామ్ ఇప్పుడు లవర్ బాయ్ గా నుంచి మాస్ హీరోగా మారిపోయారు. గత కొన్ని ఏళ్లుగా రామ్ పెళ్లి గురించి అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో కొన్ని రూమర్స్ వినిపించాయి. కానీ వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి వచ్చే ఏడాదైన వివాహ బంధం లోకి అడుగు పెడతారేమో చూడాలి మరి.