ఓ వైపు చిరు.. మరో వైపు బన్నీ.. ఈ మంగళవారం సినిమాని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో తెలుసా..?

మంగళవారం .. ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు ఎక్కడ చూసిన ట్రెండింగ్ లోకి వస్తుంది . దానికి మెయిన్ రీజన్ మెగా హీరోలు . ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడమే . అంత పెద్ద హీరోలు ఇంత చిన్న సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అని తెలియడంతో జనాలు అసలు మేటర్ ఏంటా అంటూ ఆరాధిస్తున్నారు. కాగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మంగళవారం సినిమా నవంబర్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే నవంబర్ 11న ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు మేకర్స్ . ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ వస్తున్నాడు . అంతేకాదు సినిమా ట్రైలర్ ని చిరంజీవి లాంచ్ చేశాడు . దీంతో ఎందుకు మంగళవారం పై మెగా ఫ్యామిలీ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఆరా తీయగా అసలు మ్యాటర్ బయటపడింది .

మంగళవారం చిత్ర నిర్మాత స్వాతి రెడ్డి మరెవరో కాదు ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త అయిన నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు . అంతేకాదు చిరంజీవి డాటర్ శ్రీజకు ప్రాణ స్నేహితురాలు. ఈ క్రమంలోనే వీళ్ళ ఫ్రెండ్షిప్ ను బేస్ చేసుకుని మంగళవారం సినిమా సినిమాను ప్రమోట్ చేస్తున్నారట మెగా ఫ్యామిలీ . దీంతో ఇదే న్యూస్ ను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!