సూపర్ స్టార్ మహేష్ సినీ ఎంట్రీ వెనుక దాగి ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో మీకు తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో దివంగత అగ్ర నటుడు స్వర్గీయ కృష్ణ నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు కెరీర్ మొదటిలో బాల నటుడిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా దగ్గర్నుంచి ఇప్పటివరకు వరుస‌ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇదే సమయంలో మహేష్ సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహేష్ 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించాడు.. ఆయనకు ఆరేళ్ల వయసులో తన అన్న దివంగత నటుడు రమేష్ బాబుతో కలిసి తన సొంత ఊరు బుర్రుపాలెం వచ్చాడు. అయితే మహేష్ జన్మించే సమయానికి కృష్ణ 100 సినిమాలకు పైగా నటించి తెలుగులోనే అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ అనే సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు.

ఈ సినిమాలో ఒక కీలకమైన బాల నటుడి పాత్ర ఉండటంతో మహేష్ బాబు అయితే బాగుంటాడని దాసరి అనుకున్నాడట. అయితే ఈ విషయం మహేష్ కి చెప్పకుండా అతనికి తెలియకుండా ఆ సినిమాలోని ఆయనకు సంబంధించిన షూటింగ్ను దాసరి పూర్తి చేశాడు. దాంతో నీడ సినిమా ద్వారా తనకు తెలియకుండానే కేవలం ఆరు సంవత్సరాల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు మహేష్.