పెళ్లిపై విజ‌య్ దేవ‌ర‌కొండ గుడ్‌న్యూస్.. అతి త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్న రౌడీ బాయ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లిపై గుడ్‌న్యూస్ చెప్పాడు. అతి త్వ‌ర‌లోనే ఈ హీరోగారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి మ‌రికొద్ది రోజుల్లో `ఖుషి` అనే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగులో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఆగ‌స్టు 9న ఖుషి ట్రైల‌ర్ ను లాంచ్ చేశాడు. ఈ ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పెళ్లిపై ప్ర‌శ్న‌లు ఎదుర‌వ‌గా.. ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `త్వరలో నేను కూడా పెళ్లి చేసుకుంటా.. ఆ ఘడియలు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తోంది. ఇంతకు ముందు పెళ్లి ప్రస్తావన నా ద‌గ్గ‌ర తెస్తే ఇరిటేషన్ వచ్చేది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్ల‌ను చూస్తే నాకు పెళ్లి చేసుకోవాల‌నే ఫీలింగ్ క‌లుగుతుంది` అంటూ విజ‌య్ మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు.

ఇక వైడ్ అండ్ హ‌స్బెండ్‌ రిలేష‌న్ బాగుండాలంటే ఏం కావాలి..? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు విజ‌య్ `భార్య‌భ‌ర్త‌ల‌కు ఒక‌రికొక‌రు నచ్చాలి. ప్రేమించుకోవాలి. జీవితంలో ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు… ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవాలి` అంటూ స‌మాధానం ఇచ్చాడు. మొత్తానికి పెళ్లిపై ఈయ‌న పూర్తి క్లారిటీతో ఉన్నాడు. పైగా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటా అని గుడ్‌న్యూస్ చెప్పాడు. మ‌రి ఈ శుభ ఘ‌డియ‌లు ఎప్పుడో వ‌స్తాయో చూడాలి. కాగా, విజ‌య్-ర‌ష్మిక ల‌వ్ లో ఉన్నార‌ని గ‌త కొంత కాలం నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇంతవర‌కు వారు త‌మ ల‌వ్ ను క‌న్ఫార్మ్ చేయ‌లేదు. కానీ, త‌ర‌చూ క‌లుసుకోవ‌డం, క‌లిసి వెకేష‌న్స్ కు వెళ్ల‌డం వంటి అంశాలు.. నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.