ఛీ.. ఛీ.. పెళ్లైన హీరోతో పూజా హెగ్గే అంత‌కు తెగించిందా..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆరంభంలో వరుస ఫ్లాపులను ఎదురుక్కున్న ఆ తర్వాత `డీజే` మూవీ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ మూవీ అనంతరం పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హోదా ను అందుకుంది. అగ్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇక టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తోనే బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే గత కొంత కాలం నుంచి పూజా హెగ్డే కు బ్యాడ్ టైం నడుస్తుందన్న‌ సంగతి తెలిసిందే. ఈమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. చివరగా ఈ బ్యూటీ `ఆచార్య`, `రాధే శ్యామ్`, `బీస్ట్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని నమోదు చేశాయో వివరించన‌క్కరలేదు.

వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఈ బ్యూటీ ని ఐరన్ లెగ్ గా అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే పూజా హెగ్డే కి సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేమిటంటే.. తన స్టార్ ఇమేజ్ ఏ మాత్రం డౌన్ కాకుండా ఉండేందుకు ఏకంగా పెళ్లయిన ఓ బాలీవుడ్ హీరోను తగులుకున్నద‌ట‌..ఇక అతడి ద్వారా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని ప్రయత్నిస్తోందట. ఈ క్రమంలోనే అతడితో తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో కూడా ఆలోచించకుండా పూజా హెగ్డే ను తప్పుపడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లయిన హీరోతో పూజాహెగ్డే అంతకు తెగించిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.