కాగిత వైపు యువత..జోగికి రిస్క్..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గిస్తూ టీడీపీ బలపడుతూ వస్తుంది. ఇదే క్రమంలో పెడన నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

గత ఎన్నికల్లో టీడీపీపై జోగి రమేశ్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వైసీపీ వేవ్ ఉంది..అలాగే కాగిత వారసుడుకు పెద్ద పాజిటివ్ లేదు. తండ్రికి ఇమేజ్ ఉంటే కొడుకుని ఆదరించాలని లేదు కదా అని పెడన ప్రజలు భావించారు. ఈ ప్రభావంతో పాటు జనసేన దాదాపు 18 వేల ఓట్లు చీల్చడంతో కాగిత వారసుడు ఓడిపోయారు.

అయితే ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. పైగా తన తండ్రి కాగిత వెంకట్రావు అనారోగ్యంతో మరణించారు. దీంతో కృష్ణప్రసాద్ కొన్ని రోజులు పెడనలో కనిపించలేదు. పైగా అధికారంలో జోగి రమేశ్ దెబ్బకు పెడనలో టీడీపీ క్యాడర్‌కు ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యాయి. అయినా సరే కృష్ణప్రసాద్ బయటకు రాలేదు.  స్థానిక ఎన్నికలని కూడా లైట్ తీసుకున్నారు. అలాగే టీడీపీ బలంగా ఉండే పెడన మున్సిపాలిటీని సైతం కోల్పోయారు. కేవలం ఒక వార్డు మాత్రమే గెలుచుకున్నారు.

ఈ పరిస్తితులని చూస్తే మళ్ళీ కాగిత వారసుడు గెలవరనే అంతా మాట్లాడుకున్నారు. కానీ అనూహ్యంగా పెడన జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో కృష్ణప్రసాద్ దూకుడుగా రాజకీయం మొదలుపెట్టారు. పెడన జెడ్పీటీసీని గెలిపించుకోవడం కోసం గట్టిగా పనిచేశారు. ఊహించని విధంగా పెడన జెడ్పీటీసీని టీడీపీ ఖాతాలో పడేలా చేశారు. అక్కడ నుంచి కాగిత వెనుదిరిగి చూసుకోలేదు. రోజురోజుకూ తన బలం పెంచుకుంటూ వస్తున్నారు. జోగి రమేశ్ మంత్రి అయినా సరే..ఆయనకు అధికార బలం తప్ప..క్షేత్ర స్థాయిలో బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

పైగా కాగిత నిత్యం ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు..ముఖ్యంగా పెడన యువతని ఆకర్షించేలా ముందుకెళుతున్నారు. ఈ మధ్య కాలంలో కాగిత ఎక్కడకు వచ్చినా..యువత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇటీవల అమరావతి రైతుల పాదయాత్ర పెడన నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు..అక్కడ స్థానిక యువత కాగితకు మద్ధతుగా పాదయాత్రలోకి వచ్చి సత్తా చాటారు. మొత్తానికి చూసుకుంటే పెడనలో యువత ఎక్కువ కాగిత వైపుకు వస్తున్నారు. దీని వల్ల జోగికి రిస్క్ పెరిగేలా ఉంది. నెక్స్ట్ జోగికి కాగిత చెక్ పెట్టేస్తారని పెడనలో ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా జోగికి చెక్ పడిపోయేలా ఉంది.