బాలీవుడ్ స్టార్ బ్యూటీ రాధిక ఆప్టేకు టాలీవుడ్ లోను పరిచయాలు అవసరం లేదు. ఇక ఇటీవల కాలంలో సెన్సేషనల్ కామెంట్స్ కు క్యారాఫ్ అడ్రస్‌గా రాధికా మారిపోయింది. ఎప్పటికప్పుడు సినిమాల విషయంలో తనకు జరిగిన చేదు అనుభవాలను షేర్ చేసుకుంటూ సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సౌత్ సినిమాలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. సౌత్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె మాట్లాడింది.

సినిమాల్లో అందంగా కనిపించాలని.. నా ఛాతి, పిరుదుల భాగాలలో ప్యాడ్స్ పెట్టాలని అసిస్టెంట్ డైరెక్టర్లు సజెస్ట్ చేసే వాళ్ళని.. చాలా అన్ కంపర్టబుల్గా ఉన్న తప్పక నటించాల్సి వచ్చిందని.. అలా ప్యాడింగ్ పెట్టమని వాళ్ళు అడిగినప్పుడు.. చాలా కోపం వచ్చేది. మీ ఇంట్లో అమ్మ, చెల్లికి కూడా ఇలాగే చెప్తారా అని అడగాలి అనిపించేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక ట్రిప్ తర్వాత కేవలం నాలుగు కిలోలు బరువు పెరిగానని సినిమా నుంచి తీసేశారు. కేవలం నన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాసిన కథలో.. బరువు పెరిగానని కారణంతో నన్ను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత సినిమా పెద్ద హిట్‌గా నిలిచిందంటూ ఆమె ఎమోషనల్ అయింది.
ఈ బాలీవుడ్ నటి.. కబాలి సినిమాలో నటించినప్పటి టైంలో సౌత్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందికర సంఘటనల గురించి మాట్లాడింది. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేక సౌత్ సినిమాల్లో నటించా. కానీ.. అక్కడ నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాలపై ఇలా మాట్లాడడం రాధిక కు మొదటిసారి కాదు. గతంలోనూ ఇలానే ఎన్నో కామెంట్స్ చేసింది. 20 ఏళ్ల క్రితం ఆర్థిక సమస్యలతో అడుగుపెట్ట.. అప్పుడు షూటింగ్.. సెట్స్ పై ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవంటూ ఆమె మాట్లాడింది. ఒక చిన్న ఊరిలో జరిగిన షూటింగ్ టైంలో అయితే సెట్ మొత్తం మగవాళ్ళే ఉన్నారు. నా బాడీ గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆమె కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

