ది గర్ల్ ఫ్రెండ్ vs జటాధర vs కృష్ణ లీల.. ఏది హిట్ బొమ్మ..!

వీకెండ్ సినిమాల హంగామా అప్పుడే మొదలైపోయింది. నిన్న గ్రాండ్ లెవెల్ లో ఒకేసారి మూడు తెలుగు సినిమాలు రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. వాటిలో.. మొదటిది సుధీర్ బాబు నటించిన జ‌టాధ‌ర‌. రెండవది రష్మిక మెయిన్ లీడ్‌గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్, మూడవది దేవాన్ హీరోగా.. స్వీయ డైరెక్షన్ లో తెర‌కెక్కిన కృష్ణలీల. ఇందులో.. ధన్య బాలకృష్ణ హీరోయిన్గా మెరిసింది. ఇక ఈ మూడు సినిమాల మధ్యన ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతున్న క్రమంలో.. ఏది ఆడియన్స్ మనసును గెలుచుకుంది.. ఈ పోటీలో విన్నర్ ఎవరై ఉంటారు తెలుసుకోవాలని ఆసక్తి సైతం ఆడియన్స్లు నెలకొంది. ఇక రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కిన ది గ‌ర్ల్‌ ఫ్రెండ్ సినిమా గురించి రిలీజ్‌కు ముందు భారీ హంగామా నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలావరకు పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తుంది. రష్మిక రోల్ ది బెస్ట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా కూడా చాలా వరకు ఆడియన్స్ ను ఆకట్టుకుందట. కొంతమందికి మాత్రం అసలు సినిమా ఎక్కలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ రవీంద్ర దర్శకుడుగా.. చెప్పాలనుకున్న పాయింట్లు చాలా క్లియర్ కట్‌గా వివరించాడు. అయితే.. పాయింట్ ఒక సైడ్ నుంచే తీసుకున్నాడని టాక్ హాట్ టాపిక్ గా మారినా.. రష్మిక పాత్రకు మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇక.. సపోర్టింగ్ రోల్‌లో దీక్షిత్ శెట్టి కూడా తన నటనతో అదరగొట్టాడట. ఈ క్రమంలోనే ఇద్దరు క్యారెర్ట‌రూజేష‌న్‌తో పాటు.. కథ కూడా ఆడియన్స్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు రిలీజ్ అయిన మూడు సినిమాల్లో మొదటినుంచి ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ లభించింది. అయితే.. సినిమా కూడా అదే రేంజ్ లో అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఇక.. దేవాన్ష్‌ హీరోగా తానే స్వీయ డైరెక్షన్‌లో నటించిన మూవీ కృష్ణ లీల. ధన్య బాల‌కృష్ణ ఈ సినిమాలో హీరోయిన్గా మెరిసింది. గత జన్మలో ప్రేమను.. ఈ జన్మలో దక్కించుకునేందుకు చేసే పోరాటంగా సినిమా తెరకెక్కింది.

Dhanya Balakrishna and Devan at Krishna Leela Movie promotions | Telugu360  - YouTube

అయితే.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా లాగ్ అనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్‌లో అక్కడక్కడ ఆసక్తిని నెలకొల్పుతూ యావరేజ్‌గా నడిచింది. ఈ సినిమాలో.. శివతత్వాన్ని బోధించడం హైలైట్ గా మారింది. అయితే.. శివుని గురించి వర్ణిస్తూ టైటిల్‌.. కృష్ణ లీలా అని ఎందుకు పెట్టారో మేకర్స్ కి తెలియాలి. ఇక సినిమాల్లో దేవన్ నటనతో పాటు దర్శకత్వం కూడా పర్లేదనిపించింది. ధన్య గత జన్మలో పల్లెటూరి అమ్మాయిల.. ఈ జన్మలో మోడరన్ గర్ల్ గా రెండు పాత్రల్లోనూ ఆకట్టుకుంది. కొన్నిచోట్ల సీన్స్ ఓవర్ యాక్షన్ లా అనిపించాయి. ఇక బీన్స్ సిసిరోలియో సాంగ్స్‌కు ఇచ్చిన మ్యూజిక్, బిజిఎం ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. పలు నెగటివ్ అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అయితే.. సినిమా మాత్రం మంచి నాణ్యత విలువలతో తెరకెక్కింది. ఇక ఇప్పటికే మనం తెలుగులో ఎన్నో సినిమాల్లో గత జన్మల ప్రేమను ఈ జన్మల్లో దక్కించుకున్న కాన్సెప్ట్లు చూసాం.

Jatadhara Telugu Movie Review with Rating | cinejosh.com

ఈ సినిమా చూస్తున్నంత సేపు అదే రొటీన్ స్టోరీ అన్న ఫీల్ కలుగుతుంది. కానీ.. క్యారెట్రైజేష‌న్‌ మాత్రం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దేవన్‌. ఈ క్రమంలోనే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక సుధీర్ బాబు.. మెయిన్ రోల్‌లో నటించిన జటాధార మూవీ కూడా నేడే రిలీజ్ అయింది. వెంకట్ కళ్యాణ్, అభిషేకఖ‌ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనెర్‌లో రూపొంది ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పింది. టీజర్, ట్రైలర్‌లో ఏదో భారీగా అటెంప్ట్‌ చేసినట్లు మేకర్స్ చూపించినా.. ఫైనల్గా మాత్రం సినిమా మెప్పించలేకపోతుంది. సుధీర్ బాబు ఎఫర్ట్స్‌ సినిమాల్లో 100% కనిపించినా.. స్టోరీ మాత్రం ఫెయిల్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఆడియన్స్‌లో సినిమాపై ఎంతోకొంత అంచనాలను నెలకొల్పిన రిజల్ట్ మాత్రం అస్సలు వర్కౌట్ కాలేదట. ఈ క్రమంలోనే.. సుదీర్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ చేరినట్లే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.