దేవ‌ర రివ్యూ.. తార‌క్ దెబ్బ‌కు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్న‌ర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడ‌టం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుత‌గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి దేవరా రిలీజ్ టైం రానే వచ్చింది. అటు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో తెర‌కెక్కించిన దేవర.. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వ‌చ్చిన‌ జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందా.. ఆర్‌ఆర్ఆర్ రేంజ్‌లో మరోసారి తారక్ తన సత్తా చాటుకున్నాడా.. లేదా.. ఆడియన్స్ అంచ‌నాలను అందుకుందో లేదో ఒకసారి రివ్యూ లో చూద్దాం.

క‌థ‌
సముద్ర తీరాన నాలుగు ప్రాంతాలు.. ఆ ప్ర‌జ‌లంతా సముద్రంలో కొందరు వ్యాపారుల‌ స్మగ్లర్ గూడ్స్.. దొంగతనానికి సహాయం చేస్తూ, చేపలు పడుతూ ఉంటారు. ఇక ఈ నాలుగు గ్రామాలకు నలుగురు పెద్దలు ఉంటారు. వారిలో ఒక ఊరికి దేవర (ఎన్టీఆర్) మరో ఊరికి బైరా(సైఫ్‌) పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరిద్దరు స్నేహితులు కూడా. ఇక ఈ టీంలోనే మరో ఊరి పెద్ద శ్రీకాంత్ కూడా ఉంటాడు. నాలుగు గ్రామాలకు చెందిన వాళ్లంతా ప్రతి ఏటా ఆయుధ పూజల్లో పాల్గొని మిగిలిన గ్రామాల వాళ్లను యుద్ధంలో ఓడించే.. ఆయుధాలను తమ సొంతం చేసుకుని తమ ఊరికి తీసుకువెళ్తారు. ఇక‌ దేవర ఓసారి బైరవను ఓడించి.. ఆయుద్ధాలని ఎప్పుడు వెళ్లని శ్రీకాంత్ ఊరికి వెళ్లేలా చేస్తాడు. దీంతో దేవర ఆధిపత్యాన్ని.. తన ఓటమిని భైర తట్టుకోలేక దేవరపై పగబడతాడు. తర్వాత దేవర కనిపించకుండా పోతాడు. దాదాపు 14 ఏళ్ల తర్వాత దేవర కొడుకు వరా ఎంట్రీ ఇస్తాడు. తండ్రి తనను వదిలేసి వెళ్లిపోయాడని కోపంతో బైరా టీంలో ఉంటూ తండ్రి పై కోపంతో తండ్రిమే చంపేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే వరాను తంగం ప్రేమిస్తుంది. ఇక కొంతకాలానికి బైరా దేవర‌ను చంపేందుకు కొడుకు వారని పంపిస్తాడు. ఇంతకీ బైరా జట్టు దేవరను చంపారా.. దేవర అన్నేళ్లు కనిపించకుండా ఎక్కడికి వెళ్లి పోయాడు.. కథ ఎక్కడితో ముగిసింది.. అనేది మొదటి పార్ట్ లో చూపించారు.

Devara First Review: 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే.. | Jr NTR's Devara movie First Review in Telugu

విశ్లేషణ
కొరటాల శివ సినిమాను ఎప్పటిలాగే చాలా స్లోగా మొదలు పెట్టాడు. మొదటి 30 నిముషాలు అసలు కథలో బాసలేదు. విజిల్స్ వేసేలాంటి సీన్లు ఒక్కటి కూడా రాలేదు. కథ‌ చాలా స్లోగా, రొటీన్ గా మొదలు పెట్టాడు అన్న ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుంది. ఇక మొదటి అరగంటలోనే సైఫ్, ఎన్టీఆర్ మధ్య యుద్ధం చూపించిన ఫ్యాన్స్ నుంచి అనుకున్న రేంజ్ లో విజిల్ మూమెంట్ ఉండదు. ఏదో ఉంది అన్నట్లుగానే ఆ ఫైట్ ఉంది. అసలు మొదటి గంటలో ఎన్టీఆర్ అంటే పడి చచ్చే అభిమానులకు చెప్పుకునేందుకు హైలెట్గా నిలిచే ఒక్క సీన్ కూడా లేదంటే కొరటాల స్క్రీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్ అనే అంతలా సినిమాలో అసలు ఏమీ లేదు. కనీసం కథ మొదలై గంట అయినా సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా చూపించలేదు. సినిమా ప్లాట్ గా మెల్లగా సాగింది. ఇంటర్వ్యూల్‌ బ్యాంగ్‌ కూడా వీక్ గానే ఉంది. ఇక జాన్వి కపూర్ ఎంట్రీ అసలు ఫస్ట్ షాప్ లో లేనేలేదు. సెకండ్ హాఫ్ లో ఆయుధాల కోసం వర చేసే ఫైట్ కాస్త సో సోగా అనిపించింది.. ఎన్టీఆర్ కొడుతుంటే బైరా గ్యాంగ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడే సీన్‌ ఫాన్స్ లో కొస్త ఊపునిచ్చింది.

8D Chuttamalle Song | Lyrics | Devara Movie - YouTube

సెకండ్ హాఫ్‌లో వర ఫైట్ తర్వాత వచ్చిన చుట్టుమల్లె చుట్టేసావే సాంగ్‌తో ప్రేక్షకులు కాస్త చిల్ అయ్యారు. ఇక సెకండ్ హాఫ్ లో దేవ‌ర‌ తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత దేవర ఊరికి వచ్చిన కనీసం తన ఎంట్రీ కి విజిల్స్ పడలేదు. మా ఆయుధాలు మంచి నుంచి పుట్టాయి.. మీ ఆయుధాలు మంచిని చంపడానికే పుట్టాయి.. మీ వాళ్ళ కోసం ఈ పని కోసం మళ్ళీ నా దగ్గరకు వస్తే మీ సవాలు కూడా ఈ గట్టు దిగవు అంటూ దేవర గతంలో చెప్పిన ట్రైలర్.. డైలాగు లాంటివి ఒకటి రెండు తప్ప అస‌లు డైలాగ్స్ కూడా ఏమీ రాయలేదు కొరటాల. అసలు ఒక్క డైలాగ్ కూడా విజిల్స్ లేకపోవడంతో డీలా పాడిన ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ లో వర సముద్రంలో చేసే ఫైట్ బాగున్న ఆ ఊపును ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోయారు. ఆచార్య వాళ్లు వీళ్లు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కద పోయిందనుకోవచ్చు. కానీ.. దేవర పార్ట్ 1 చూశాక కొరటాల సీన్ అయిపోయిందని కొత్తగా రాయడం.. తీయడం.. పూర్తిగా ఆపేసాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మాస్ రొటీన్ సినిమాను మరింత నీరసంగా తన స్టైల్ లో తెరకెక్కించి ఆడియన్స్ డీలపడేలా చేశాడు.

Devara's horrible CG bonanza : r/tollywood

పర్ఫామెన్స్
ఇక నటి న‌టుల‌ పర్ఫామెన్స్ కి వస్తే ఎన్టీఆర్ నటనకు పేరు పెట్టడానికి లేదు. తన నటనతో తను మెప్పించడానికి చూశాడు. కానీ కథలో కంటెంట్ లేకపోతే తారక్ మాత్రం ఏం చేస్తాడు. ఇక హీరోయిన్ జాన్వి కపూర్ పాత్ర నడివి పరిమితం. అందాల ఆరబోతకే అమ్మడి పాత్ర అనిపించింది. నటన గురించి చెప్పుకోవడానికి స్కోప్ లేదు. సైఫ్ అలీ ఖాన్ ఓకే అనిపించుకున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గెటప్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సిందని అనిపించింది. ఇక మురళి శర్మ ఇలాంటి పాత్రలు ఎన్నో నటించాడు. ఈ క్రమంలో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. షైన్ టామ్‌ చాక్, గెటప్ శీను తదితరులు తమ పాత్ర మేరకు మెప్పించారు.

Devara: Jr NTR Starrer Becomes First Telugu Film to Screen in Dolby Atmos in the UK

చివ‌రిగా కొరటాల శివ కథనాలు ప్రేక్షకుడి అంచనాలను అసలు అందుకోలేకపోయాయి. సెకండ్ హాఫ్ లెన్త్ ఎక్కువైంది. అయితే ఎన్టీఆర్ నటన యాక్షన్ చూడడానికి, అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం ఎంజాయ్ చేసేందుకు, రత్నవేలు సినిమా ఆటోగ్రఫీ కోసం దేవరను చూడొచ్చు. కానీ.. ఎక్కువ అంచనాలతో వెళితే నిరాశ ఎదురవుతుంది.