దేవ‌ర షాకింగ్ రిజ‌ల్ట్.. మైన‌స్‌లు ఇవే..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన దేవర మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. తారక్ నుంచి సోలోగా సినిమా వచ్చి ఆరేళ్లు గ్యాప్ రావడంతో సినిమాపై ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్రమోషన్స్ లోనూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తి పెంచేసాయి.Devara: Part 1 First Look - Bollywood Hungamaఇక‌ భారీ అంచనాలు నడుమ తాజాగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా నిన్న అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ఆడియన్స్‌ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే దేవరకు ఎవరు ఊహించని విధంగా షాకింగ్ రిజల్ట్ వస్తుంది. ఎక్స్ వేదికగా ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ అంతా తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. కొంతమంది యావరేజ్ అంటూ.. మరి కొంతమంది బ్లాక్ బస్టర్ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.Devara Second Single Release Date And Time Revealed: Jr. NTR's Movie Song Coming Soon - Filmibeatఎన్టీఆర్ నటన బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు. అనిరుధ్‌ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటూ చెబుతున్నారు. అయితే కథలో కొత్తదనం లేదని.. సెకండ్ హాఫ్ మరి ల్యాగా అనిపించిందని.. కొరటాల తన పాత చింతకాయ తొక్కు పచ్చడి విధానాన్ని ఈ సినిమాకు ఉపయోగించారని.. స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కథనంలోనూ సరైన బసలేదని.. ఫస్ట్ ఆఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్.. రొటీన్ కదా.. క్లైమాక్స్‌ వీక్ గా ఉంది అంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాను సేవ్ చేద్దామని ట్రై చేసినా కథలో కంటెంట్ లేకపోతే ఏం ఉపయోగం అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.