మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ డిజాస్టర్ నుంచి కోలుకునేందుకు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వంభర చిరు కెరీర్‌లో 156వ సినిమాగా తెరకెక్కుతోంది.
ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు దర్శకులు చిరు 157వ ప్రాజెక్ట్‌ను టేకాఫ్ చేసేందుకు క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కిస్తోన్న దర్శకుడు హరీష్ శంకర్ చిరు 157వ ప్రాజెక్టు మీద కన్నేసి ఉన్నాడట.
అలాగే మారుతి కూడా చిరును డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. చిరు 157 ఛాన్స్ దక్కించుకోవాలని మెగా కాంపౌండ్‌లో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. అలాగే గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కించిన మోహనరాజా కూడా చిరుతో మరో సినిమా కూడా ట్రై చేస్తున్నాడు. చిరంజీవే స్వయంగా మోహనరాజాకు మరో అవకాశం ఇస్తానని చెప్పారు. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరు ఫైనల్‌గా చిరు 157 ఛాన్స్ దక్కించుకుంటారు.. లేదా చిరు మరో దర్శకుడికి ఈ అవకాశం ఇస్తారా ? అన్నది చూడాలి.