రోషన్ ” ఛాంపియన్ “హైలెట్స్.. టాక్ ఎలా ఉందంటే..?

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోషన్ మేక తాజాగా నటించిన మూవీ ఛాంపియన్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై వచ్చే సినిమాలు, కంటెంట్ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా వరకు దాదాపు అన్ని బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అదే నమ్మకంతో రోషన్ ఛాంపియన్ సినిమా ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా 2 గంటల 40నిమిషాల ర‌న్ టైంతో క్రిస్మస్ కానుకగా(నేడు) రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్లో పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఇది కేవలం ఫుట్‌బాల్ చుట్టూ తిరిగే కథ‌ కాదని.. 1940 కాలంలో బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీ అని.. తెలంగాణ హిస్టరీలోనే మర్చిపోలేని బైరన్ పల్లి ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తుంది.

Champion movie: రోషన్ మేక సరసన మలయాళీ బ్యూటీ, ఫస్ట్ లుక్ అదిరింది -  BigTvLive

ఓవైపు.. ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని.. హీరో పడే తపన.. మరోవైపు తన ఊరి కోసం ప్రజల కోసం చేసే పోరాటంగా కథ రూపొందింది. ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్డ్‌గా డైరెక్టర్ చూపించాడట. పిరియాడిక్ కథలు ఎమోషన్స్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్ప‌న‌వసరం లేదు. ఇక హీరో రోషన్ తనదైన నటనతో పాత్రలో ఒదిగిపోయాడని.. బాడీ లాంగ్వేజ్‌తో పాటు.. ఎమోషనల్ సీన్స్‌లో మెచ్యూర్డ్‌ పెర్ఫార్మన్స్ ఇచ్చాడంటూ టాక్‌ నడుస్తుంది. ఇక.. మలయాళం ముద్దుగుమ్మ అనస్వర రాజన్‌కు ఇది మొదటి సినిమా అయినా.. తన నటనతో మ్యాజిక్ చేసిందని స్క్రీన్‌పై ఆమె నటన మరింత హైలెట్ అంటూ చెబుతున్నారు. నాణ్యత విలువలు కూడా చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయట.

Champion Roshan Movie

1940 కాలంలోకి వెళ్లి మరి నిజంగా సినిమా తీసినట్లు అనిపించిందని.. అప్పటి పల్లెటూరి వాతావరణం బైరంపల్లి వీధులను కళ్ళకు కట్టినట్లు చూపించారని అంటున్నారు. దీనికి తోడు మిక్కీ. జే. మేయర్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, స్టోరీ నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయట. విజువల్స్‌కి ప్రాణం పోసినట్లు ఉందని సమాచారం. ఇక క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా మారింది. చివరిలో ఒక్క భారీ ట్విస్ట్‌ అసలు ఆడియన్స్ ఊహించని సర్ప్రైజ్ అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే క్లైమాక్స్ ప్రతిఒక్క ఆడియన్స్ హార్ట్‌ను టచ్ చేసేలా చాలా బలంగా ఉందని.. చాలా కాలం తర్వాత స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్‌లో కలుగుతుందని రివ్యూ షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్‌గా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. థియేటర్లలో ఛాంపియన్ ఎమోషనల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.