అఖండ 2: వరల్డ్ వైడ్ కలెక్షన్స్ డే 1 ప్రిడిక్షన్.. ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం పై రిలీజ్‌కు ముందు అంచనాలు ఆకాశాన్నికంటిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్‌లో జరిగింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.114 కోట్లపైగా రిలీజ్ బిజినెస్ జరుపుకున్న అఖండ 2.. బ్రేక్ ఈవెనై.. క్లీన్ హిట్గా నిలవాలంటే రూ.115 కోట్ల షేర్ కలెక్షన్లు కల్లగొట్టాల్సి ఉంది. అంటే.. దాదాపు రూ.220 కోట్ల గ్రాస్ రాబట్టాలి.

ఈ క్రమంలోనే సినిమాపై కేవలం నందమూరి అభిమానులు కాదు.. ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. సినిమా ఎప్పుడు వచ్చినా భారీ ఓపెనింగ్స్‌ కాయమంటూ కలెక్ష‌న్ల విష‌యంలో ధీమా వ్యక్తం చేశాయి. దానికి తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాలయ్య రేంజ్ మరోసారి రుజువైంది. ఇక ఈ సినిమా కంటే ముందు బాలయ్య నటించిన నాలుగు సినిమాలు కూడా హిట్‌గా నిలవడంతో.. అదే జోష్‌లో బాలయ్య ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలోనే.. గత సినిమా వాయిదాతో పాటు.. అఖండ 2పై ఉన్న క్రెస్ కూడా భారీ వసూళ్లకు ప్రధాన కారణం. ఇప్పటివరకు బాలయ్య వరల్డ్ వైడ్ గా వీరసింహారెడ్డి తో ఫస్ట్ డే.. రూ.54 కోట్లు, డాకు మహారాజ్ తో రూ.56 కోట్లు కలెక్షన్ లో అందుకున్నాడు. ఇక.. అఖండ 2కు ఈ రెండు సినిమాలు మించి పోయే రేంజ్ లో హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ 2కి.. రూ.60 కోట్లకు పైగా ఓపెనింగ్ కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. ట్రేడ్ అంచనాలను నిజం చేస్తూ.. బాలయ్య రికార్డులు క్రియేట్ చేస్తాడో.. లేదో చూడాలి.