నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడు అంటూ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది. అఖండ 2 సినిమా అడ్డంకులు అన్నింటిని దాటుకుని.. నిన్న ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఇక సినిమా కొద్ది గంటల క్రితం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచి ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జనరల్ ఆడియన్స్ సైతం సినిమా పై మంచి ఆసక్తి కనబరిచారు. అయితే.. సినిమా డిసెంబర్ 5న రావాల్సి ఉండగా.. వాయిదా పడడంతో ఈ ఆలస్యం సినిమాకు మరింత ప్లస్ అయింది. సినిమా ఆగిపోవడంతో దీని గురించి చర్చలు హాట్ టాపిక్ గా మారింది. దీంతో హైప్ డబల్ అయింది.
ఇక ఈ హైప్ యూజ్ చేసుకొని.. మేకర్స్ డిసెంబర్ 12న రిలీజ్‌కు ఫిక్స్ చేశారు. అంచనాలకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే.. సినిమా సీనియర్ హీరోల కేటగిరీలో ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కూడా.. ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ అంటే ఇది సాధారణ విషయం కాదు.

కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు.. సినిమాకు ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి రూ.7 కోట్ల రూపాయల గ్రాస్ బుకింగ్స్ జరిగాయట, ఓవరాల్గా నైజాంఅడ్వాన్స్ బుకింగ్స్ తో రూ.8 కోట్లకు పైగానే వచ్చాయని.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్, రేగ్యులర్ షోస్ కలుపుకొని స్ట్రాంగ్ నెంబర్‌లో టికెట్లు బుక్ అయినట్లు సమాచారం. ఇక.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకను కూడా కలుపుకొని ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ రూ.20 కోట్ల వరకు జరిగాయంటూ.. వరల్డ్ వైడ్ గా నిన్న రాత్రికే అడ్వాన్స్ బుకింగ్స్ పాతిక కోట్ల మేర జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 50 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఇది మరింతగా పెరగొచ్చు. ఇక సినిమా రెస్పాన్స్‌నుబట్టి.. ఫుల్ రన్ లో రూ.180 నుంచి రూ.200 కోట్ల రేంజ్ గ్రాస్ కొల్లగొట్టే అవకాశం ఉంది.

