బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ డివోషనల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సిక్వెల్ గా అఖండ్ 2 తాండవం రూపంతుడుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ బంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజి టాక్ తెగ వైరల్ గా మారుతుంది.
ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌లో పూనకాలు కాయం అనడంలో సందేహం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ, సీజీ యుగం నడుస్తుంది. తెల్లవారితే చాలు.. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు. చూడగానే నిజమా అనిపించేలా డిజైన్ చేస్తున్నారు. ఇది విచిత్రమేమీ కాదు. భవిష్యత్తులో గతించిన గొప్ప హీరోలను.. మళ్ళీ సినిమాల్లో చూపించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ క్రమంలోనే అఖండ 2 లో ఈ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారట.
ఇంతకీ అసలు ఏఐ ఎందుకు వాడారు.. ఏఐ తో సృష్టించిన అద్భుతమైన సీన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అఖండ 2 కోసం టీం ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ ను రంగంలో దింపారట. అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమాల్లో ఓ సన్నివేశంలో శివుడిగా సీనియర్ ఎన్టీఆర్ ను టీం చూపించబోతున్నారట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ఇది నిజం అంటూ.. ఇండస్ట్రీకి చెందిన కొందరు.. బలంగా సేమ్ టు సేమ్, డైలాగ్స్ వివరిస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం అలాంటిదే ఏమీ లేదని వివరించారు. మరి.. ఎవరి మాటల్లో నిజముందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.


