ఇటీవల కాలంలో.. సౌత్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పాత సినిమాలు రిలీజై రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నాయి. అలా.. రీసెంట్గా బాహుబలి వరుస సిరీస్‌లతో బాహుబలి ది ఎపిక్ గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అసలు రీ రిలీజ్‌కి అర్థం ఏంటో తెలిసేలా రికార్డులు క్రియేట్ చేసింది. అంత డెడికేషన్ తో సరికొత్త టెక్నాలజీలను ఉపయోగించి గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తే సినిమాలు రిలీజ్ చేశాడు జక్కన్న. అదే రేంజ్‌లో టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని సైతం.. తన కెరీర్ లోనే ఆల్ టైం క్లాసికల్గా నిలిచిపోయిన శివ 4కే సినిమాను రిలీజ్ చేశాడు.
కాగా.. ఈ సినిమాను ఈ జనరేషన్ ఆడియన్స్ పెద్దగా వీక్షించలేదు. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ పెంచేందుకు.. స్టార్ హీరోలు, దర్శకులతో ప్రమోషన్లు చేయించారు మేకర్స్. ఈ క్రమంలోనే.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. అలా.. భారీ హైప్‌తో నిన్న(నవంబర్ 14న) గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా.. అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటూ మంచి కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక మూవీ రిలీజ్‌కు ముందు.. దాదాపు 20 వేలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా బుక్ మై షో లో అమ్ముడుపోవడం విశేషం. కాగా.. నిన్న రిలీజ్ రోజున బుక్ మై షోలో 16 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలా సినిమా ఫస్ట్ డే విడుదలైన అన్నీ చోట్ల భారీగా వసూళ్లను రాబట్టింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దేవీలో రూ.10 లక్షల, సుదర్శన్ 35 ఎంఎంలో రూ.12.5 లక్షల కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఫస్ట్‌డే వసూళ్లు ఇలానే ఉన్నాయట. ఇక ఓవర్సీస్‌లో గురువారం ప్రదర్శించిన ప్రీమియర్లకు 4 వేల డాలర్లు అంటే రూ.3.5 లక్షల, శుక్రవారం రూ.25 లక్షల వరకు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రబంలోనే సినిమా తొలి రోజు భారీగానే వసూళ్లు సాధించిందని.. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే దాదాపు.. రూ.1.5 నుంచి రూ. 2కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిందని టాక్.

ఇటీవల కాలంలో నాగార్జున కొత్త సినిమాలకు సైతం ఈ రేంజ్‌లో టికెట్లు సేల్ కాలేదు. అంతలా.. నాగ్ మార్కెట్ పడిపోతూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో.. పాత సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కచ్చితంగా శివ సినిమా రిలీజ్‌లోను మరపురాని జ్ఞాపకంగా అక్కినేని ఫ్యాన్స్ కు నిలిచిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శివతో పాటు.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కొత్త సినిమా కాంత నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా కలెక్షన్లు కూడా శివ రీ రిలీజ్‌ను డామినేట్ చేస్తుందంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ రిత్యా శివ కు రీ రిలీజ్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కచ్చితంగా మూవీ లాంగ్ రన్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడుతుందా.. లేదా.. వేచి చూడాలి.


