టాలీవుడ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తాజాగా కాంతార సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రిషబ్ టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నాడు. స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1.. రూ.800 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రిషబ్ దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. తాను నటించే నెక్స్ట్ సినిమాల విషయంలో ఫ్యాన్స్‌తో పాటు.. సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తి మొదలయింది. ఇప్పటికే.. ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. రిషబ్ తాజాగా మరో తెలుగు భారీ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్ ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారని సమాచారం. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి డైరెక్టర్ అశ్విన్ గంగరాజు దర్శకుడుగా వ్యవహరించనున్నాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై.. ఇప్పటికే బాలీవుడ్‌లో చర్చలు మొదలైపోయాయి.



