లేటెస్ట్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1కు.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. కలెక్షన్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. తాజాగా.. బాక్సాఫీస్ బరిలో.. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను సైతం చిత్తు చిత్తు చేసిన ఈ మూవీ.. మూడు రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో సాధించిన నెట్ కలెక్షన్స్ ముందు.. ఈ ఇద్దరు స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు వెలవెలబోయాయి. ఇంతకీ.. ఈ మూడు రోజుల్లో కాంతార ప్రీక్వెల్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం.
అసలు ఈ మూవీకి పాన్ ఇండియా లెవెల్లో మొదటి రోజు రూ.61.8 కోట్లు నెట్ కలెక్షన్లు రాగా.. రెండవ రోజు.. కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. రూ.42 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. అయితే శనివారం మళ్లీ కలెక్షన్స్ గ్రాఫ్ పెరిగింది. ఈ క్రమంలోనే కాంతర చాప్టర్ 1 మూడో రోజున రూ.55 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు దక్కించుకుంది. కన్నడ వర్షన్ రూ.14.5 కోట్లు, తెలుగులో రూ.11.75 కోట్లు, హిందీలో రూ.19 కోట్లు, తమిళ్లో రూ. 5.75 కోట్లు, మలయాళం లో రూ.4.25 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇలా.. సినిమా మొత్తంగా మూడు రోజుల్లో కలిపి పాన్ ఇండియా లెవెల్లో రూ.163.10 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం.
ఇక వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సల్మాన్ ఖాన్ లాస్ట్ మూవీ సికందర్.. పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ రన్లో కేవలం.. రూ.110 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కించుకుంది. శంకర్ డైరెక్షన్లో చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ లో రూ.131 కోట్ల వసూళ్లను మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్లను కాంతార 2.. మూడు రోజుల్లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. కన్నడలో రూ.150 కోట్లను దక్కించుకున్న నాలుగవ సినిమాగా కాంతార చాప్టర్ 1 రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లోను.. కాంతారకు.. మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా రెండు రోజుల్లో అక్కడ 2.5 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. అంటే రూ.22 కోట్లు. వీకెండ్ అయ్యే సరికి నాలుగు మిలియన్ డాలర్ల చేరుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.