టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు.. ఈసారి చరణ్‌తో ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా భారీ లెవెల్ మాస్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో.. రఫ్ అండ్ రగడ్ లుక్‌లో చరణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే.. ఈ సినిమా షూట్ తుది దశకు చేరుకుందని సమాచారం. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆడియన్స్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక.. తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. బుచ్చిబాబు సన్నా డైరెక్టర్ కంటే ముందు.. సుకుమార్ శిష్యుడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. మొదట్‌లో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు.. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారీ తన సత్తా చాటుకున్నాడు. ఇక.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు సుక్కు కో ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా.. ఆయన సినిమాలోను భాగమయ్యాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. సుకుమార్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం దగ్గర ఉండి చూసుకుంటున్నాడట.

బుచ్చి బాబుతో కలిసి టెక్నికల్ అంశాలను పర్యవేక్షిస్తున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. సుకుమార్ స్టైల్ లో కంటెంట్‌కు ఒక ప్రత్యేకమైన క్వాలిటీ టేకింగ్ ఉండేలా చూసుకుంటున్నాడని సమాచారం. ఇక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. చరణ్ – ఎఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పటికే రెహమాన్ పలు ట్యూన్స్ ని కూడా సిద్ధం చేసేసాడట. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ పరంగా కూడా పెద్ది అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న క్రమంలో సుకుమార్.. సినిమా పనులు దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్ ఆడియన్స్ లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.

