టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ సినిమాకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే.. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్న దిల్ రాజు.. మరోసారి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేసాడట. ప్రస్తుతం పవన్ ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత.. పవన్ స్టామినా ఏంటో ఆడియన్స్‌కు అర్థమైంది. దీంతో.. సినిమాను ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. అసలు పవన్ లాంటి స్టార్‌కి సరైన కంటెంట్ పడితే ఏ రేంజ్‌లో ఆడియన్స్ దానికి బ్రహ్మరథం పడతారని ఓజీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు చేరువవుతూ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది.
ఈ క్రమంలోనే.. పవన్ నెక్స్ట్ సినిమా గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓజీ సక్సెస్‌తో దానికి ఫ్రీక్వెల్స్, సీక్వెల్ కూడా ఉండనున్నాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ సైతం ఈ సినిమాల్లో కచ్చితంగా కనిపిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇవే కాదు ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక పవన్.. నుంచి వచ్చే ఏడాదిలే సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తూ.. మరో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అది కూడా.. వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్ పై.. ఆయన సినిమా చేయనున్నట్లు సమాచారం.
అయితే.. దిల్ రాజు మాత్రం పవన్‌ను ఒకే ఒక్క రిక్వెస్ట్ చేశారు. మీరు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ కు ఆన్సర్ గా తన బ్యానర్ లోనే సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వకీల్ సాబ్ లాంటి స్టోరీ వస్తే.. కచ్చితంగా మళ్ళీ సినిమా చేద్దాం అని పవన్ హామీ ఇచ్చాడట. దీంతో దిల్ రాజు ఫుల్ ఖుషి. మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కోసం సెర్చింగ్ లో మొదలు పెట్టాడు. సరైన కథతో ఒక్క దర్శకుడు తగిలితే చాలని ఎదురు చూస్తున్నాడట. అంతేకాదు.. వకీల్‌సాబ్ లాంటి ప్రాజెక్ట్ నచ్చిన వేణు శ్రీరామ్‌నే తీసుకొని మంచి కథను డిజైన్ చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.