టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బిగ్గెస్ట్ మాల్టిస్టారర్ మూవీ వార్ 2.. థియేటర్లలో రిలీజై.. చాలా కాలమే అవుతున్నా.. ఇంకా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చాలామంది సినీ లవర్స్ తో పాటు.. ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు కూడా.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మరికొద్ది గంటలో సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఎట్టకేలకు ముందు నుంచి చెప్పినట్లే.. అక్టోబర్ 9న ఈ సినిమా గ్రాండ్గా స్ట్రీమింగ్ కానుంది.
అయితే.. ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ మొదలైంది. అసలు మేటర్ ఏంటంటే.. అక్టోబర్ 9న ఈ సినిమాను కేవలం మూడు భాషల్లో మాత్రమే రిలీజ్ చేయనున్నారట. అది కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మాత్రమేనని సమాచారం. అంటే.. కనడ, మలయాళ భాషలో సినిమా స్ట్రీమ్ కావడం లేదు. ఆ రెండు భాషల అభిమానులకు కచ్చితంగా ఈ సినిమా విషయంలో నిరాశ తప్పదు. ఇక్కడ మరో ట్విస్ట్ థియేటర్లలో రిలీజ్ అయిన సేమ్ కంటెంట్ సేమ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది.
కొత్త కంటెంట్ యాడ్ అవుతుందని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను జత చేస్తారని.. గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ విషయంలో ఫాన్స్‌కు నిరాశ తప్పదు. ఇక.. ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో థియేటర్లో ఫ్లాప్ గా నిలిచిన.. ఓటిటి ప్లాట్ఫామ్ లలో మాత్రం భిన్నమైన రిజల్ట్‌ను అందుకుంటు రికార్డులు క్రియేట్ చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే వార్ 2 నెట్‌ప్లిక్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. డిజిటల్ ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు వేచ్చి చూడాలి.