కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకుడుగా.. తానే హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా.. రిషబ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. అంతేకాదు సినిమాలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ తమతైన పాత్రలో 100% ఎఫర్ట్స్ పెట్టారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని డివోషనల్, మాస్, బోల్డ్నెస్.. ఆల్ మిక్సింగ్ మాస్టర్ పీస్ మూవీ ఇది అంటూ సినిమాటిక్ యూనివర్స్ లో సరికొత్త అద్భుతం అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
చాలా మంది సెలబ్రిటీలు సైతం ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ నెట్టింట తెగ వైరల్గా మారుతున్నాయి. అక్టోబర్ 2న గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. దాదాపు ఏడు భాషల్లో.. 7వేలకు పైగా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ.235 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఇక నాలుగో రోజున కేవలం పాన్ ఇండియా లెవెల్ లోనే రూ.61.5 కోట్లను కొల్లగొట్టింది. మొత్తానికి నాలుగు రోజుల్లో కాంతార రూ.335+ కోట్ల క్లబ్లో చేరి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఇక.. ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్లో అదే హైప్ కొనసాగుతుంది. థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు.. ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే లాంగ్ రన్లో సినిమా వేయికోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.