బిగ్ బాస్ 9 దివాలి స్పెషల్: కంటెస్టెంట్లను కన్నీళ్లు పెట్టించిన బిగ్ బాస్..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్ బాస్ సీజన్ 9.. ప్రస్తుతం రసవత్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెర ఆడియన్స్‌ను అంతకంతకు ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్న ఈ షో.. నేటితో ఆరువారాలను కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. దీపావళి సెలబ్రేషన్స్.. బిగ్‌బాస్ హౌస్లో గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. కలర్ఫుల్ డ్రెస్లతో.. అంతకుమించిన గేమ్స్, సాంగ్స్ తో హౌస్ మొత్తం కళకళలాడిపోయింది. అంతేకాదు హౌస్ లో కంటెంట్ల‌కు దీపావళి సర్ప్రైజ్‌గా బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ మరింత సంతోషాన్ని కలిగించింది.

Bigg Boss Telugu 9: Full list of contestants in the house, theme & more |  Entertainment News - Business Standard

ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. కంటెంట్స్ అందరికీ కూడా కొత్త బట్టలు ఇవ్వడమే కాదు, రుచికరమైన వంటలతోనూ హౌస్ లో పండగ తీసుకువచ్చాడు బిగ్ బాస్. ఎపిసోడ్ మొత్తం సంతోషంగా సాగిన చివర్లో మాత్రం వాళ్లతో కంటతడి పెట్టించాడు. అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా వీకెండ్‌లో భాగంగా.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ 42వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో.. ఒక టాస్క్ నిర్వహించడం.. నాగార్జున తన మూడు పదాలు చెప్తూనే.. ఆ మూడు పదాలను గెస్ చేసి సినిమా పేరు చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. అంతేకాదు.. అందులో గెలిచిన లక్కీ పర్సన్ కి ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియోను ప్లే చేస్తామని వివరించారు.

అలా మొదట ఈ గేమ్ లో డిమాన్‌ పవన్ విన్న‌ర్‌గా గెలిచి.. ఆయన తల్లి పంపిన వీడియో మెసేజ్ ను చూశాడు. తర్వాత.. సుమన్ శెట్టి భార్య వీడియో మెసేజ్.. చివరిలో సంజ‌నా ఫ్యామిలీ వీడియో వచ్చాయి. అయితే.. చివర్లో వచ్చిన సంజనా ఫ్యామిలీ వీడియో మెసేజ్ అందరికీ కంటతడి పెట్టించింది. ఏడాది కూడా నిండని చిన్నారిని.. వదిలిపెట్టి హౌస్ లోకి సంజన వెళ్లారు. తన భర్త.. కొడుకు, కూతుర్ని పక్కన పెట్టుకొని నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావ్.. ఖచ్చితంగా సక్సెస్ కూడా వ‌స్త‌తుంది.. మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది అంటూ ఆమెకు వీడియో సెండ్ చేసాడు. ముఖ్యంగా కూతుర్ని చూసి సంజనా ఎమోషనల్ అయింది. ఈ క్రమంలోనే.. దీపావళి కేవలం కంటిస్టెంట్‌ల‌కే కాదు.. ఆడియన్స్‌ను కూడా.. కచ్చితంగా ఆకట్టుకునేలా ఉందట. ఇక చివరిలో హౌస్‌లోనే స్ట్రాంగె కంటెస్టెంట్ టాప్ 5లో నిలుస్తాడు అనుకున్న భరణిని.. హౌస్ నుంచి ఎలిమినేట్ చేయనున్నట్లు తెలుస్తుంది.