కాంతార 1 టీంకు బిగ్ షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఫెయిల్..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కోసం దక్కుతున్నాయి. ఆల్మోస్ట్ బడ్జెట్ రికవరీ అవుతుంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్లు కాదు.. మంచి కంటెంట్ ఉంటే అసలు పెద్దగా పరిచయం లేని చిన్న నటుల సైతం స్టార్ సెలబ్రెటీల్ గా పాన్‌ ఇండియన్ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. కాంతార కూడా.. పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. భారీ టార్గెట్ తో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. 2002లో సౌత్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కాంతారకు ఫ్రీక్వల్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ క్రమంలోనే.. సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూ.400 కోట్ల మేర వసూళ్లు కొల్ల‌గొట్టింది.

Kantara: Chapter 1: Rishab Shetty To Recreate Divine Magic With One Of The  Biggest Set In Kundapur Town, Coastal Region Of Konkan

రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు సైతం దక్కింది. దీంతో సినిమా సీక్వెల్ పై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కు ముందే భారీ హైప్‌ నెలకొల్పింది. హెంబాలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2 దసరా, గాంధీ జయంతి నేషనల్ హాలిడేను సైతం టార్గెట్ చేసుకునే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమాకు మరో రోజు మాత్రమే గ్యాప్ ఉన్న క్రమంలో బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయని ట్రేడ్ వరక‌గాలు చెప్తున్నాయి. మొదటి నుంచి బ్లాక్ బ‌స్టర్ రేంజ్ కు వెళ్లిన ఈ సినిమా.. నార్త్ మార్కెట్లో కనీసం పది నుంచి 15 కోట్ల ఓపెనింగ్ ద‌క్కించుకుంటుందని భావించిన విశ్లేషకులకు పెద్ద షాక్‌ తగిలింది.

ప్రస్తుతం సినిమాపై ఉన్న ట్రెండ్ మాత్రం అంచనాలను అస్సలు రీచ్ కావడం లేదట. దీనికి కారణం ఏంటనే కోణంలో ట్రేడ్ ఎనాలసిస్ మొదలెట్టింది. ఇందులో మొదటిది సినిమా ఎఫెక్ట్. కాంతార 1 ఫినామినస్ మూవీ.. అది సడన్ సర్ప్రైజ్ ప్యాకేజ్.. ఎవరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కొత్త కల్చర్, కొత్త యాక్టర్, కొత్త రిలీజ్ అయింది. కాన్సెప్ట్ అదిరిపోవడంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు.. వస్తుంది ప్రీక్వెల్. ఈ సినిమా విషయంలో ఎలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ లో లేవు. కధలో ఏముంటుంది.. ఎంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది అనే దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక బుకింగ్స్ పై ట్రైలర్ ప్రభావం కూడా పాడింది.

Rishab Shetty brings authenticity to 'Kantara: Chapter 1' with year-long  Kalaripayattu training

మిక్స్డ్‌ టాక్ దక్కించుకున్న ఈ ట్రైలర్ కారణంగా కూడా సినిమా బుకింగ్స్ కాస్త డల్ గా ఉన్నాయని అంటున్నారు. ఇక నార్త్ మార్కెట్లో అక్టోబర్ 2న హాలిడే కావడం.. టైం కు హిందీలోనూ పలు పాన్‌ ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో.. కాంపిటేషన్ కారణంగా నాతో మల్టీప్లెక్స్ లో ఎక్కువ స్క్రీన్లు, షోలు దొరకడం సాధ్యం కాదు. ఇక సినిమాపై ముందు నుంచి ఏమైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్.. బుకింగ్స్‌కు మైనస్ అవుతుందట. ఇలా రకరకాల కారణాలతో సినిమాకు మాత్రం ఊహించిన రేంజ్ లో బుకింగ్స్ ద‌క్క‌డం లేదు. కానీ.. డే వన్ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రెండవ రోజు నుంచి బుకింగ్స్ పుంజుకుంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.