టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 24న అమెరికా ప్రీమియర్స్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఇండియన్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది ఓజి. ఈ క్రబంలోనే తాజాగా.. డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిర సినిమాస్ ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రీమియర్ ప్రీ సేల్స్ ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఊహించని రేంజ్‌లో రికార్డుల మాత మోగిస్తుందంటూ వెల్లడించారు. ప్రీ సేల్స్‌లోనే ఉత్తర అమెరికా అడ్వాన్స్ బుకింగ్ లక్షల డాలర్లకు పైగా సొంతం చేసుకుందని.. 400కు పైగా లొకేషన్లలో మొత్తం 32 వేలకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని వెల్లడించారు. ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూసి.. పలు థియేటర్ సర్క్యూట్లు అదనపుషోలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయని.. సంఖ్య మరింతగా పెరగనుంది అంటూ అఫీషియల్ గా పోస్ట్ చేశారు.
గతంలో పాన్ ఇండియన్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఈ రేంజ్‌లో.. ఇంత వేగంగా 9 లక్షల డాలర్ల మార్క్‌ను టచ్ చేయలేకపోయాయని.. కానీ ఓజీ మాత్రం ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ విషయంలో ఇలాంటి రికార్డును క్రియేట్ చేసిందంటూ సమాచారం. పవనిజం ఏ రేంజ్ లో ఉప్పొంగుతుందో.. మరోసారి ఈ టికెట్ బుకింగ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది అంటూ సినీ ఫేషకులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా మేరవనున్నాడు. హష్మి తన పవర్ఫుల్ రోల్ తో మొట్టమొదటిసారి సౌత్ ఇండియా పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నిజమైన పాన్ ఇండియన్ స్పెషల్ మూవీ గా నిలవనుందని ఫ్యాన్స్ నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.