టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మరో 11 రోజుల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక సుజిత్ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాలా రూపొందించిన ఫీల్ ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో అనిపిస్తుంది.
ఇక సుజిత్ తన విజన్ కు తగ్గట్టుగా ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా పవన్‌ను చూపించాడు. ఈ సినిమాతో పవన్‌కు ది బెస్ట్ రిజల్ట్ సుజిత్ ఇవ్వడం ఖాయమంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. తాజాగా.. సినిమా విలన్ క్యారెక్టర్ లో ఇమ్రాన్ హష్మీ కి రిలేటెడ్ థీం మ్యూజిక్‌ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం కొత్త రకాల ఇన్స్ట్రుమెంట్స్ ను విదేశాల నుంచి తెప్పించి మరీ సినిమాకు హైప్ పెంచాడు. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ఎగ్జాంపుల్. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం ప్రీమియర్ షో నుంచి ఇప్పటివరకు 73 వేలకు పైగా టికెట్లను సేల్ చేసిందట. అంటే.. అమెరికన్ డాలర్ల లెక్కలో 17 లక్షల డాలర్లు గ్రాస్ కొల్లగొట్టిందని.. ఇండియన్ కరెన్సీ లో రూ.16 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఓవర్సీస్ లో తమిళ్ తంబిలో ఎక్కువగా సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఆదేశాలలో టికెట్లు వేగంగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఉదాహరణకు యూరప్‌లో తమిళియన్స్ నివసిస్తూ ఉంటారు. అక్కడ సినిమాకు.. తమిళ్ సినిమాల కంటే ఎక్కువ టికెట్లు బుక్ అవుతున్నాయి. ఉదాహరణకు నెదర్లాండ్ లో ఇప్పటివరకు కూలి సినిమాకి అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయాయి. మన టాలీవుడ్ సినిమాలు అసలు ఇప్పటివరకు కనీసం రిలీజ్ కూడా కాలేదు. కానీ.. ఓజీ సినిమా ఇక్కడ కూలి రికార్డులను తుక్కుతుక్కు చేసేలా ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రాన్స్ లాంటి దేశంలోని ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది. చూస్తుంటే ఓజీ సినిమా టాలీవుడ్‌కు సరికొత్త టార్గెట్లు తెచ్చి పెట్టేలా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.