కాంతార 1: హైదరాబాద్ లో వార్.. బెజవాడలో చెక్.. ఇప్పుడైనా తెలుగు ఆడియన్స్ శాంతిస్తారా..?

తాజాగా కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో మెరిసిన కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్, హీరో అయిన రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడంపై పెద్ద దుమారం రేగింది. తెలుగు ఆడియన్స్‌ సైతం.. దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బాయికాట్ కాంతారా చాప్టర్ 1 చేస్తూనే ఉన్నారు. ఇక.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు కర్ణాటకలో జరిగిన అవమానాలన్నింటినీ గుర్తు చేసుకుని ఓజి సినిమా విషయంలోనూ మళ్ళీ అదే రిపీట్ అవుతున్న క్రమంలో.. తెలుగు ప్రేక్షకులు మరింత మండిపడుతున్నారు.

Kantara: Chapter 1 - Wikipedia

ఇలాంటి క్రమంలో.. రిషబ్ శెట్టి తెలుగు రాష్ట్రాలకు వచ్చే సినిమా ప్రమోషన్స్ చేసుకుంటూ కన్నడలో మాట్లాడి తెలుగు భాషను అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. దీంతో బాయ్‌కాట్‌ ట్రైండ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తన వల్ల జరిగిన ఈ తప్పుకు.. వివాదానికి చెక్ పెట్టే అవకాశం ఇప్పుడు మరోసారి దొరికింది. కాంతర చాప్టర్ 1కు సంబంధించిన మరో ఈవెంట్ నేడు సెప్టెంబర్ 30న‌ ఆంధ్రప్రదేశ్‌.. విజయవాడలో గ్రాండ్‌గా జరగనుంది.

It's Official: Rishab Shetty's Kantara: Chapter 1 trailer to drop on  Navratri Day 1 – Date and time revealed | PINKVILLA

ఈ ఈవెంట్‌లో మరోసారి రిషబ్‌కు ఆడియన్స్‌తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. కనుక.. ఇప్పటికైనా హైదరాబాద్‌లో జరిగిన పొరపాటుకు వివరణ ఇస్తాడా.. లేదా బెజవాడలో ఈ వివాదానికి చెక్ పెడతాడా.. అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక ఇప్పటికే కాంతర చాప్టర్ 1 సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల పెంపు విషయంలో అనుమతులు వచ్చేసిన సంగతి తెలిసిందే. కనుక.. ఆ కృతజ్ఞతలు సైతం రిషబ్ చూపించాల్సిన సమయం ఇది. విజయవాడలో జరగబోయే ఈవెంట్ లో రిషబ్ శెట్టి స్పీచ్‌పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.