పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే తప్పేముంది.. అలా చాలామందున్నారు.. స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా ధూపియకు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు.. హిందీలో మంచి పాపులారిటీ దక్కించుకున్నా.. తెలుగులోను పలు సినిమాల్లో మెరిసింది. 2003లో ఖయామత్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నేహా.. తర్వాత జూలీ, స్టిక్కర్ ఫ్యాన్ ధాన్, రేరగిలే, బాడ్ న్యూస్ లాంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగులో స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ అమ్మడు.. రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్‌గా ఆకట్టుకుంది.

బాలకృష్ణ పరమవీరచక్రా లోను ఓ కీల‌క‌ పాత్రలో నటించింది. తర్వాత.. తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ.. ఫోడ్‌ కాస్ట్ కండక్ట్ చేస్తూ.. స్టార్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక 2018 మే 10న అంగద్ భేడిని గురుద్వార్‌లో వివాహం చేసుకున్న నేహా ధూపియా.. తను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడం వల్ల హడావిడిగా వివాహం చేసుకున్నానని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించింది. పెళ్ళికి ముందే గర్భం దాల్చడం.. తల్లిదండ్రుల ఒత్తిడితో.. 72 గంటల్లోనే ప్రియుడిని పెళ్లాడాల్సి వచ్చిందని వివరించింది.

Happy birthday Neha Dhupia: 10 super adorable pictures of the actor with  her kids Mehr, Guriq | Bollywood - Hindustan Times

పెళ్లయిన ఆరు నెలలకే మొదటి బిడ్డ పుట్టేసిందని.. దాంతో ఆమెపై ఓ రేంజ్ లో ట్రోల్స్ మొదలయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది నేహా శెట్టి. తాజాగా.. ఆమె మాట్లాడుతూ నేను పెళ్లికి ముందు తలినయ్య.. అందులో తప్పేముంది. నేను మాత్రమే కాదు.. పెళ్లికి ముందే గ‌ర్భం దాల్చిన‌ వాళ్లు చాలామంది ఉన్నారు. అందరిని వదిలేసి.. నిన్నే ట్రోల్స్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నేహా దూపియా కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి.