సినీ ఇండస్ట్రీలో నటి నటులుగా అడుగు పెట్టిన చాలామంది ముద్దుగుమ్మలు ఎలాంటి కామెంట్స్ అయినా ఓపెన్ గా చేసేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో.. బోల్డ్ వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు అదే లిస్టులోకి మరో హీరోయిన్ చేరిపోయింది. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైన దీక్ష పంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. బిగ్ బాస్ ద్వారా తన పేరు తెగ వైరల్ గా మారింది. తర్వాత కొన్ని సినిమాల్లో అడపదడప పాత్రలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కెరీర్ మొదట్లో సోషల్ మీడియా ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్, కామెంట్స్ చేస్తూ హైలెట్ గా మారిన దీక్ష.. తాజాగా ఓ ఫోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి.
సినీ పరిశ్రమలో సక్సెస్, రిలేషన్ షిప్ లాంటి సెన్సిటివ్ టాపిక్ ల గురించి ఆమె రియాక్ట్ అవుతూ.. తన ఆలోచనల గురించి ఓపెన్ గా కామెంట్స్ చేసింది. దీక్ష పంత్ మాట్లాడుతూ సక్సెస్ కోసం సెక్స్ చేస్తే తప్పేంటి.. ఇండస్ట్రీలో చాలాసార్లు ఇది కామన్. ఎవరో ఒకరు సక్సెస్ కావాలంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోక తప్పదు.. ఇద్దరు అంగీకరించినప్పుడు అసలు సెక్స్‌లో తప్పేముంటుంది అది వాళ్ళ పర్సనల్ డెసిషన్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.
అయితే దీక్ష మాట్లాడుతూ.. నేను మాత్రం ఎప్పుడూ అలాంటి పని చేయలేదని.. ఆ దారిని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలేదంటూ ఓపెన్ గా వివరించింది. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినపుడు కాస్టింగ్ పరిస్థితులు చాలానే ఎదురయ్యాయి కానీ.. నేను వాటిని అసలు పట్టించుకోలేదు. దాని కారణంగానే నేను బహుశా పెద్ద స్టార్ గా మారలేకపోయానేమో అంటూ వివరించింది. కానీ.. నా మనసు నాకు ఎప్పుడు క్లియర్ గా అనిపిస్తుంది. అందుకే ఎలాంటి పశ్చాతాపం ఉండదు అంటూ ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. చాలా మంది దీక్ష ఇలాంటి బోల్డ్ కామెంట్స్ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేందుకే చేస్తుందంటూ నెగిటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.