వార్ 2 vs కూలీ: అసలు వార్ మొదలవ్వకముందే కూలికి బిగ్ షాక్..!

మరి కొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ట‌ఫ్‌ ఫైట్ మొదలవుతుంది. వార్ 2 వర్సెస్ కూలి ఒకదానితో ఒకటి గ్రాండ్ పోటీతో బరిలోకి దిగనున్నాయి. ఇండియన్ ట్రేడ్ వర్గాల నుంచి సినీ ఆడియన్స్ వరకు అంతా ఈ సినిమాలు ఏది హిట్ అవుతుంది.. ఏది విన్నర్ గా నిలుస్తుంది.. క్రేజీ రికార్డులను కొల్లగొడుతుందో.. తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చలు మొదలయ్యాయి. కొన్ని వెబ్సైట్లో వాళ్ళు పోల్స్ కూడా కండక్ట్ చేస్తూ ఆ పోలింగ్ ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇక రెండు బిగ్గెస్ట్ సినిమాలు గానే కాదు.. డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, స్క్రీన్ కౌంట్, ఓవర్సీస్ ఎక్స్టెన్షన్ లాంటి బిజినెస్ లెక్కల్లో ఒకదాన్ని మించి ఒకటి పోటీగా రాణిస్తున్నాయి.

ట్రైలర్ టాక్ మాత్రం రెండింటికి ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ అయితే ద‌క్క‌లేదు. మిశ్రమ ఫలితాలు సొంతం చేసుకున్నాయి. ఇంకా భారీ కాంబినేషన్‌కి ఇది సరిపోతుందా అనే ప్రశ్న ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలో రిలీజ్ కు ముందే వార్‌లో కూలికి పెద్ద దెబ్బ పడనందు అంటూ టాక్‌ వైరల్ గా మారుతుంది. కారణం.. డిస్ట్రిబ్యూషన్ డెఫిసిటీ. కూలీ హిందీ వర్షన్‌ను పెన్‌ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది. బ్యానర్ ఇప్పటివరకు ఎక్కువగా డిజాస్టర్ ట్రాక్ రికార్డు ఉంది. 2025లో సికందర్, హౌస్ ఫుల్ 5, మాలిక్, మా, కన్నప్ప సినిమాలను రిలీజ్ చేస్తే అన్ని డిజాస్టర్ గానే మెల్లగా దీంతో ఇంత భారీ కాస్టింగ్ ఉన్న సినిమాను పెన్సిల్ స్టూడియోస్ లాంటి డిజాస్టర్ సంస్థకు పాన్ ఇండియా రిలీజ్ చేయమని బాధ్యతలు అప్పజెప్పడం పెద్ద రిస్కీ అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఈ క్రమంలోనే కంటెంట్ సూపర్ గా ఉన్నా.. డ్రైవింగ్ చేసే వ్యక్తి పర్ఫెక్ట్ కాకపోతే గమ్యం చేరుకోలేరని బాలీవుడ్ మీడియా సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. ఇక వార్ 2 సినిమాకి అయితే య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ లాంటి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం బ్యాక్ బోన్ గా నిలిచింది. ఫిలిం మార్కెటింగ్ లో వైఆర్ఎఫ్‌ కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. వైఆర్ఎఫ్ స్ట్రాటజీ ప్రకారం వార్ 2కు పాన్ ఇండియా స్క్రీన్ కౌంట్.. క్లియర్‌కట్, మల్టీ లాంగ్వేజ్ ట్రైలర్స్, ముంబై నుంచి హైదరాబాద్ వరకు మార్కెటింగ్ ఫ్లాష్ పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూలి సినిమా కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నా.. పాన్ ఇండియన్ బిజినెస్ మెకానిజంలో స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం సినిమాకు భారీగా దెబ్బవుతుందని.. వార్ 2కి మాత్రం డిస్ట్రిబ్యూషన్, స్క్రీన్ షేర్ ,మల్టీ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ లోను మంచి ప్రొఫెషనల్ ప్లానింగ్ కనిపిస్తుందని టాక్. ఈ క్రమంలోనే ప్రస్తుతం వార్ 2 వర్సెస్ కూలి వార్ స్టార్ హీరోల మధ్యన కాదు.. స్ట్రాటజీల మధ్యనే అని తేలిపోయింది.