హీరోయిన్ కమలిరీ ముఖర్జీకి తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా మెరిసే ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక.. చివరిగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో మెరిసిన ఈమె తర్వాత రెండు ఇతర భాష సినిమాల్లో నటించినా.. 2016 నుంచి మాత్రం ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో కమల్ని ముఖర్జీ తెలుగు సినిమాలకు దూరమవ్వడంపై క్లారిటీ ఇచ్చింది.
తను మాట్లాడుతూ.. నేను తెలుగులో అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మాయిగా నటించా. చాలా సినిమాల్లో అమ్మా నాన్న లేని అనాధనాలు కనిపించా. బలమైన స్త్రీ రోల్స్, అదే టైంలో సున్నితమైన పాత్రలు చేశా. కానీ.. రాను రాను బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్ లో పడటం లేదు. గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన పాత్ర లేదని నాకే అనిపించింది. మూవీ కంప్లీట్ అయ్యాక నేను పోషించిన రోల్ చూసి నేనే చాలా ఇబ్బందిగా ఫీలయ్యా. బాధపడ్డ. దానికోసమే నేను గొడవ పడాలని, రచ్చ చేయాలని అసలు భావించలేదు. గోవిందుడు అందరివాడేలే తర్వాత అందుకే నేను తెలుగులో సినిమాలు చేయలేదు.
టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా. అలా అని.. నాకు ఎవరిపై కోపం కూడా లేదు. సినిమా అంటే ఇలాంటివి జరుగుతుంటాయి. డైరెక్టర్ ఓ సీన్ చేయమంటారు.. తిరా అవసరం లేదనో, బాలేదనో.. ఎడిట్ చేసేస్తారు. మాకు చెప్పను కూడా చెప్పరు. ఒక్క మాటైనా చెప్పకుండా మన సీన్ డైలాగ్ తీసేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. దాని నేను అస్సలు లైట్ గా తీసుకోలేను. ఈ క్రమంలోనే తెలుగు సినిమా నుంచి తప్పుకొని.. ఇతర భాషల్లో సినిమాల్లో నటించా అంటూ వివరించింది. ఇక మలయాళం మూవీ పులిమురుగన్ తర్వాత.. నాకు వివాహమైంది. సినిమాలకు దూరంగా ఉంటునా. చిన్నప్పుడు చదువుకే సమయం కేటాయించ. పెద్దయ్యాక సినిమాలు చేశా. ఇప్పుడు భార్యగా సక్సెస్ఫుల్ ఫ్యామిలీని రన్ చేయాలని అనుకున్న అంటూ కమల్ని ముఖర్జీ వివరించింది. ప్రస్తుతం కమలిని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.