స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ అమ్మడు.. తర్వాత పర్సనల్ కారణాలతో పాటు.. మాయాసైటిస్ బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా.. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించింది. టాలీవుడ్ సినిమాల్లో మాత్రం అమ్మడు కనిపించింది లేదు. తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తన కొత్త సినిమా మా ఇంటి బంగారంను ప్రకటించి చాలా కాలమే అయింది.
కానీ.. షూట్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కాగా.. ఇప్పుడు సినిమా దర్శకత్వ బాధ్యతల్ని నందిని రెడ్డి టేక్ ఓవర్ చేసుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఓ బేబీ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా కోసం ఇద్దరు సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నరని సమాచారం. అంతేకాదు.. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందట.
సామ్ ఇందులో మునుపెన్నడు చూడని వైవిధ్యమైన పాత్రలో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయనున్నట్లు సమాచారం. ఆమె పాత్ర యాక్షన్ కోణంలో సాగుతుందట. ఇక.. గతంలో రిలీజ్ అయిన టైటిల్ లుక్‌తోను దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇతర నటినటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.