నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు అవునన్నా.. కాదన్న.. ఇదే వాస్తవం అంటూ.. ఎన్నో రోజులుగా రకరకాల సంఘటనలు నెలకొన్నాయి. నారా ఫ్యామిలీ మొత్తం ఓవైపు ఉంటే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే మరోవైపు మిగిలిపోయారు. ఇక గతంలో వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడిచినా.. ఇప్పుడు మాత్రం నేరుగానే ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ప్రస్తుతం తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకుంటున్నాడు. మరోపక్క కళ్యాణ్ రామ్ సైతం సైలెంట్ గా తన పనులు తాను చేసుకుంటున్నాడు.
అయినా టిడిపిలోని కొందరు వ్యక్తులు వీళ్ళను కవ్వించేలా మాట్లాడుతూ ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా అనంతపురం ఎమ్మెల్యే వార్ 2 సినిమా ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చి ఎన్టీఆర్ తల్లి పై అత్యంత నీచమైన భాషను ఉపయోగిస్తూ చేసిన కామెంట్స్.. ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక రీసెంట్గా నారా రోహిత్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వార్ 2 సినిమా పై.. సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆయన హీరోగా నటించిన సుందరకాండ సినిమాలో ప్రమోషన్స్ సందడి చేస్తున్నాడు రోహిత్. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీసెంట్గా విడుదలైన కూలీ, వార్ 2 సినిమాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
కూలీ సినిమాని చూశాను. అందులో కొన్ని బ్లాక్స్ చాలా నచ్చాయి. ఓవరాల్ గా పర్లేదు. వార్ 2 సినిమా నేను అసలు చూడలేదు. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. మా స్నేహితులు రెండిట్లో ఏ సినిమా చూడొచ్చు అంటే కూలి సినిమా అన్నారంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. రెండు సినిమాలు థియేటర్స్ లో ప్రస్తుతం రన్ అవుతున్నాయి రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఇలాంటి క్రమంలో ఓ సెలబ్రిటీ హోదాలో ఉన్న పర్సన్ రెండు సినిమాలను కంపేర్ చేస్తే ఒక సినిమా చాలా బాగుంది.. ఓ సినిమా బాలేదని అర్థం వచ్చేలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వార్ 2 చూడలేదు.. సమయం దొరికినప్పుడు చూస్తా అంటే సరిపోయేది. కానీ.. అసలు ఆ సినిమా చూసే ఆసక్తి లేదని కామెంట్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.