కూలీ మీద భారీ అంచనాలు – లోకేష్ గ్యాంబ్లింగ్ ఫ్లాప్ అయ్యిందా?

లోకేష్ కనకరాజ్ అంటేనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే యూత్ నుంచి మాస్ వరకూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. “కూలీ” అనే టైటిల్ రివీల్ అయ్యినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ ఆ అంచనాలే చివరికి సినిమా మీద భారమైపోయాయి. ఈసారి లోకేష్ ఒక పెద్ద పాన్‌ఇండియా కాంబినేషన్ తీసుకొచ్చాడు. ప్రతి భాష నుంచి ఒక స్టార్‌ని పట్టుకొచ్చి భారీగా కాస్ట్ చేశాడు. వాటిలో ముఖ్యంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఎంట్రీనే సెన్సేషన్. ఎందుకంటే అమీర్ చిన్న సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయన ప్రతి పాత్రకు విలువ ఇస్తారు. అలాంటి నటుడు ఇలాంటి సినిమాలోకి ఎందుకు వచ్చారు? అనే ప్రశ్న అందరికి కలిగింది.Who is 'Vikram' director Lokesh Kanagaraj's wife Aishwarya Kanagaraj? |  Entertainment News – India TVఅసలు విషయం ఏమిటంటే… లోకేష్ “విక్రమ్”లో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ను రిఫరెన్స్‌గా చూపించి అమీర్‌ని ఒప్పించినట్టు ఫిలింనగర్ టాక్. చివర్లో బ్లాస్టింగ్ ఎంట్రీ ఇచ్చే మాస్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పి అమీర్‌కి సైన్ చేయించారట. అందుకే బాలీవుడ్ స్టార్ కూడా సౌత్‌లో తొలిసారి అంగీకరించారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి ఆ అంచనాలన్నీ కుప్పకూలిపోయాయి. రోలెక్స్ ఎంట్రీ సినిమాలో కథకు బలమైన టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. కానీ “కూలీ”లో అమీర్ పాత్రని బలవంతంగా కథలో ఇరికించినట్టే అనిపించింది. కథ ముందుకు సాగడానికి ఆ పాత్ర అవసరమే లేనట్టే. పైగా అమీర్ ని పూర్తిగా పబ్లిసిటీ గిమ్మిక్ కోసం వాడేసుకున్నట్టే కనిపించింది.Coolie review. Coolie Tamil movie review, story, rating - IndiaGlitz.comలోకేష్ మైండ్‌సెట్ ఇక్కడే తప్పిపోయింది. సూర్య సర్ప్రైజ్ ఎంట్రీగా వచ్చి హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ అమీర్ ఎంట్రీని ముందే ప్రొమోషన్స్‌లో హైలైట్ చేయడం పెద్ద తప్పిదం అయ్యింది. సినిమా చూసినవాళ్లకు “ఇంతకంటే అమీర్ లేకపోయినా వచ్చేనష్టం ఏమీ లేదు” అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో “కూలీ” సినిమాకు క్రియేటివ్‌గా బిలో అవరేజ్ మార్కులు పడిపోయాయి. అమీర్‌కి సౌత్‌లో తొలి ప్రయోగం నిరాశనే మిగిల్చింది. ఇక లోకేష్ కనకరాజ్‌పై ఉన్న ప్రేక్షకుల నమ్మకం కూడా కొంత వరకు దెబ్బతిన్నట్టు అనిపిస్తోంది. మొత్తానికి – భారీ సెటప్, స్టార్ కాస్టింగ్, పాన్‌ఇండియా హంగామా అన్నీ ఉన్నా.. కంటెంట్ బలహీనంగా ఉంటే ఎంత గ్యాంబ్లింగ్ చేసినా ఫలితం శూన్యమే అన్నది “కూలీ” రుజువు చేసింది.