కోడి రామకృష్ణ తలకు తెల్లటి ఖర్చీఫ్ వెనుక స్టోరీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒకప్పుడు వర్సెస్ సక్సెస్ లో అందుకుంటే తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోయిన వారిలో డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒకరు. తన కెరీర్లు 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి దాదాపు అన్ని సినిమాలతోనే మంచి సక్సెస్ లో అందుకున్న ఆయన.. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, హిందీలోనే పలు సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించాడు. కేవలం సినిమాలే కాదు.. కోడి రామకృష్ణ లుక్స్ సైతం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేది. వెళ్లనిండా ఉంగరాలతో పాటు.. తలకు తెల్లటి క‌ట్టు కట్టుకొని ఓ వైవిధ్యమైన లుక్ లో ఆయన బయటకు వస్తారు. సినిమా షూట్ టైంలో కచ్చితంగా నుదుటిపై ఖ‌ర్చీఫ్‌ ఉండాల్సిందే. ఈ క్రమంలోనే అయిన దాదాపు అన్ని ఫోటోలు అలానే కనిపిస్తాయి. కాగా.. ఈ తలకట్టు వెనుక పెద్ద స్టోరీ నే ఉందట. ఈ రహస్యాన్ని స్వయంగా కోడి రామకృష్ణ శిష్యుడు.. డైరెక్టర్, నటుడు దేవి ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

S. V. Krishna Reddy | TOLLYWOOD CREW

దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. నేను కోడి రామకృష్ణ గారి దగ్గర 20 సినిమాల వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించా. ఆయన ది కంప్యూటర్ మెదడు. రోజు మొత్తం పని చేసిన ఒకేరోజు మూడు సినిమాల షూటింగ్స్ చేసిన అసలు అలిసిట రానివ‌రు. ఏ ఒక్క విషయాన్ని కూడా అసలు మర్చిపోని ఆయన.. మరో సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి వచ్చాడనే విషయాన్ని మాకు.. అంటే డైరెక్టర్ టింకు తప్ప వేరే వాళ్లకు తెలియనిచ్చేవారు కాదు.. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ స్పాట్‌కు చేరుకునే ఆయన.. అర్ధరాత్రి 2 గంటల వరకు షూటింగ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ కంటే ముందు సినిమాల నుంచి ఆయన తలకు తెల్లటి ఖర్చీఫ్‌ కట్టుకుంటాడని.. దాని వెనుక స్టోరీని ఆయన చాలాసార్లు రివీల్ చేశారంటూ వివ‌రించాడు. ఆయన నుదురు చాలా పెద్దగా ఉంటుంది.

Kodi Ramakrishna: Veteran director Kodi Ramakrishna passes away | Telugu  Movie News - Times of India

ఒకసారి షూటింగ్ టైంలో మేకప్ మ్యాన్‌ వచ్చి.. నుదురు భాగం పెద్దగా ఉంది ఎండ తాకకుండా నుదుటికి కర్చీఫ్ కట్టుకొమ‌ని ఓ తెల్లటి గుడ్డ ఇచ్చాడు. అది కట్టుకున్న కోడి రామకృష్ణ గారికి.. ఆ రోజంతా చాలా పాజిటివ్ ఫీల్ వచ్చినట్లు అనిపించిందట. ఈ క్రమంలోనే తర్వాత నుంచి ఆయన ప్రతిరోజు షూట్ కు వచ్చినప్పుడు తెల్లటి ఖర్చులు నుదుటికి కట్టుకోవడం ప్రారంభించాడు. అలా.. కట్టుకొని దర్శకత్వం వహించిన రెండు సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ విషయాన్ని మీడియా మరో రకంగా ప్రచారం చేసింది. సినిమాలో హిట్ అయ్యాయి అంటే ఆ తెల్లటి క్లాత్ వల్లే.. సెంటిమెంట్ కోసమే ఆయన ఆ కర్చీఫ్ ని కట్టుకున్నాడని పత్రికలు రాసుకోచ్చాయి. ఆయన నార్మల్గానే అలా కట్టుకున్న మీడియా ప్రచారాన్ని నిజం చేసి.. తలకట్టు ని ఆయన కంటిన్యూ చేశాడు. ఇదే విషయాన్ని గతంలో కోడి రామకృష్ణ సైతం పలు ఇంటర్వ్యూలో వివరించారు. ఇక ఆయన అనారోగ్య సమస్యలతో 2019లో తుది శ్వాస విడిచారు.