‘ మహావ‌తార నరసింహ ‘కు చాగంటి రివ్యూ: నిజమైన నరసింహ స్వామి వచ్చినట్టుంది..

ఇండస్ట్రీ ఏదైనా సరే.. సినిమా రిలీజ్ అయింది అందులో కంటెంట్ ఉంటే కచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిన్న సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కోల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకుంటూ రాణిస్తున్న మైథ‌లాజికల్ యానిమేషన్ మూవీ మహావతార నరసింహ. కిమ్స్‌ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. జూలై 25న చాలా నిశ్శబ్దంగా రిలీజై సంచలనాలు సృష్టించింది. ఇక‌ రిలీజ్ తర్వాత మౌత్ టాప్ తోనే అదిరిపోయే రెస్పాన్స్‌ దక్కించుకుంది.

సౌత్, నార్త్ అని తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఆడియన్స్‌లో సినిమాపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాపై ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఇంట్రెస్టింగ్ రివ్యూ ని షేర్ చేసుకున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి సినిమాను వీక్షించిన ఆయన.. సినిమా పూర్తి అయిన తర్వాత తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో పంచుకున్నాడు. ఈ వీడియోను గీతా ఆర్ట్స్ బ్యానర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు మేకర్స్‌. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.

Geetha Arts to release Mahavatar Narasimha in Telugu states

ఇక పురాణాలకు మహావతార నరసింహ చాలా దగ్గరగా ఉందంటూ వివరించిన ఆయన.. భక్త ప్రహ్లాద లాంటి సినిమాలు ప్రజల మధ్యలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాయని.. అయితే ఇప్పుడు మనుషులతో కాకుండా కేవలం యానిమేషన్ బొమ్మలతో సినిమా తీసిన నిజంగా నరసింహ అవతారం వచ్చినట్లు అనిపించిందని చాగంటి కోటేశ్వరరావు వివరించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చిన ఆయన.. కుటుంబ సమేతంగా సినిమాను చూడొచ్చు అంటూ వివరించాడు. చాగంటితో పాటే.. శాంత బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి సైతం ఈ సినిమాను వీక్షించాడు. ఆయన కూడా సినిమా అద్భుతంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం వీరిద్దరి రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా క‌లెక్ష‌న్‌లు కొల్లగొట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే.