కింగ్‌డ‌మ్‌లో నటించిన ఈ కొత్త విలన్ బ్యాగ్రౌండ్ తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఆ సినిమా ఏదైనా సరే.. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా.. తాజాగా ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ కింగ్‌డ‌మ్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. గౌతంతిన్న‌నూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. ఇక జూలై 31 అంటే మరో రెండు రోజుల్లో సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

New Villain in Vijay Deverakonda's Kingdom: Who is Venkatesh PV? - NTV Telugu

ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ వేడుకలు తిరుపతిలో గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఇక రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో ఓ కొత్త ఫేస్ అందరిని ఆకట్టుకుంది. ఇంతకీ ట్రైలర్లో కనిపించిన ఆ కొత్త విలన్ ఎవరు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి.. తెలుసుకోవాలని ఆసక్తి నెటిజన్స్‌లో మొదలైంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా రిలీజ్ అయిన కింగ్‌బడ‌మ్ ట్రైలర్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే.. సినిమా ట్రైలర్‌లో కనిపించిన కొత్త విలన్ పేరు వెంకటేష్ విపి. మలయాళ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న ఆయన.. 2014లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో మొదట్లో పలు సీరియల్స్‌లో నటించిన ఆయన.. తర్వాత సినిమాలోని అవకాశాలు దక్కించుకున్నారు.

Vijay Deverakonda's Kingdom Teaser tops YouTube trends

అంతేకాదు.. నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవి ప్రకాష్ హీరోగా తెర‌కెక్కిన‌ రెబల్ మూవీలోను ఆయన విలన్ పాత్రలో మెరిసాడు. ఈ క్రమంలోనే అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకుని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెంకటేష్.. తెలుగులో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ లో విలన్ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేశాడు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో వెంకటేష్ కేవలం రెండు షార్ట్స్ లోనే క‌నిపించిన.. ఆ కొద్ది క్షణాల షార్ట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఈ కొత్త ఫేస్ ఎవరిది.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని అంత ఆసక్తి చూపారు. ఇక ట్రైలర్లో మెప్పించినట్లే.. కింగ్డమ్ మూవీలో వెంకటేష్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకుని మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటే.. టాలీవుడ్‌లోనో మరిని అవకాశాలు దక్కించుకొని తనకంటూ ప్రత్యేక మార్క్‌ క్రియేట్ చేసుకుంటాడు అనడంలో సందేహం లేదు. ఇప్పటికైతే ఇండస్ట్రీలో హీరోలు టాలీవుడ్‌లో విలన్‌లుగా అడుగుపెట్టి మంచి సక్సెస్‌లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్‌డ‌మ్ మూవీలో మెరిసిన వెంకటేష్ సైతం తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తే.. ఇక టాలీవుడ్‌కు మ‌రో యంగ్ విలన్ దొరికినట్లు అవుతుంది. మరి ఈ సినిమాతో వెంకటేష్‌ సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.