ఇటీవల ప్రతిష్టాత్మకంగా.. ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ.. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ పోటీల్లో.. మిస్ థాయిలాండ్ ఓపెన్ సుచాత.. విజేతగా నిలిచింది. ఇక ఈ సక్సెస్ తో అమ్మడి జీవితం పూర్తిగా టర్న్ అవుతుందనే చెప్పాలి. ఇంతకీ మిస్ వరల్డ్ సక్సెస్ అందుకున్న విజేతలకు వచ్చే.. లగ్జరీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మిస్ వరల్డ్‌గా ప్రకటించిన వెంటనే.. రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు.. వజ్రాలతో పొదిగిన కిరీటం దక్కింది. వీటికంటే ఎంతో విలువైన ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
రానున్న ఏడాది కాలం పాటు.. దేశ దేశాల.. అందరి నోట ఈమె పేరే మారుమోగిపోనుంది. పేరు మోసిన బ్రాండ్లకు అంబాసిడర్ గా, మోడల్ గా, నటిగా.. సోషల్ కార్యక్రమాల్లోనూ ఆమెకు వరుస అవకాశాలు క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు. మిస్ వరల్డ్ సంస్థ తరఫున.. ఈ బ్యూటీ పలు కార్యక్రమలలో భాగంగా.. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంలో భాగంగా.. ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా ఆమెకు లగ్జరీ బెనిఫిట్స్‌తో పాటు.. ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిష్లు, న్యూట్రిషనిస్టులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు.
ఖరీదైన మేకప్ కిట్లు, బట్టలు, నగలు లాంటివన్నీ ఆమెకు ఉచితంగా లభిస్తాయి. ఎక్కడికెళ్లినా స్టార్ ఇమేజ్.. స్ట్రాంగ్ సెక్యూరిటీ పక్కా. ఇక మిస్ వరల్డ్ కాగానే.. ఆమె ధరించిన కిరీటాన్ని ప్రతి అణువు ప్రపంచ సుందరి పోటీల్లో ప్రాముఖ్యతను.. మహిళా శక్తిని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ కిరిటం నికర విలువ లక్ష అమెరికన్ డాలర్లని.. భారత కరెన్సీలో రూ.85.56 లక్షలని సమాచారం. అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. కిరీటం విజేత సొంతం కాదు. వచ్చే ఏడాది పోటీల్లో సక్సెస్ అందుకునే యువతికి ప్రస్తుతం మిస్ వరల్డ్ స్వయంగా దీనిని అందించాలి. అయితే కిరీటం ప్రతిరూపాన్ని ఆమెకు ఇస్తారు.