తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే రాబోతుంది . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బుల్లితెరను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసేలా ఊపేస్తుంది . మనకి తెలిసిందే బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ లేడీస్ ఎంత ఇష్టపడుతూ ఉంటారు. ఆ గొడవలు.. ఆ అల్లర్లు.. ఆ గిల్లికజ్జాలు చాలా చాలా బాగుంటాయి అంటూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా కావాలనే గొడవ పెట్టుకునే తీరు చాలా గమ్మత్తుగా ఉంటుంది . అయితే బిగ్బాస్ మొత్తంగా 7 సీజన్ లు కంప్లీట్ చేసుకున్నాయి . త్వరలోనే ఎనిమిదవ సీజన్ రాబోతుందట .
అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా మళ్లీ అక్కినేని నాగార్జున నే హోస్ట్ చేయబోతున్నాడు అన్న వార్త అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ చేశారు . ఆ తర్వాత అన్ని సీజన్స్ కి నాగార్జున నే హోస్టింగ్ చేశారు. హోస్స్ట్ మారాలి అంటూ ఎంతమంది ఫాన్స్ డిమాండ్ చేస్తున్న బిగ్బాస్ మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోవడం లేదు . అయితే బిగ్ బాస్ సీజన్ 8కి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ లేదా రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది .
సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . అంతేకాదు ఈ సీజన్ మరింత రసవత్తరంగా ప్లాన్ చేస్తున్నారట. స్టార్ కపుల్స్ ని కూడా జంటగా లోపలికి పంపించబోతున్నారట . అంతేనా ఈసారి టిఆర్పిస్ ని పెంచే విధంగా సరికొత్త టాస్కులు కూడా పెట్టబోతున్నారట. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో బిగ్ బాస్ షో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక పూర్తయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి..!!