బాలయ్య మజాకా ముచ్చటగా మూడోసారి డబుల్‌ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.. మామూలుగా ఉండదు మరి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను దక్కించుకుని సూపర్ ఫామ్ లో దూసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జోష్‌లో తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది.

ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎంతో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో బాలయ్య ఒక పాత్రలో కాస్త ఓల్డ్ గెటప్ లో శ్రీలీలకు తండ్రిగా కనిపించబోతున్న‌డు. ఈ సినిమాలోని మరో పాత్రను ఇప్పటివరకు దర్శకుడు రివిల్ చేయలేదు. ఆ క్యారెక్టర్ కాస్త యంగ్ లుక్ లో ఉంటుందని తెలుస్తుంది.

వీర సింహారెడ్డి మరియు అఖండలో కూడా బాలయ్య డబుల్ రోల్ ల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ రెండు సినిమాలు కూడా బాలయ్య కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు బాలకృష్ణ వరుసగా మూడో సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాను దర్శకుడు ఏ విధంగా తెరకెక్కించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.