టార్గెట్ 40: సీమలో వైసీపీకే సులువేనా..!

రాయలసీమ అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..సీమలో మాత్రం వైసీపీకే అనుకూలమైన పరిస్తితులు ఉంటాయి. 2014లో రాష్ట్రంలో టీడీపీ హవా ఉంటే..సీమలో  వైసీపీ వేవ్ నడిచింది. ఒక్క అనంతపురం మినహా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. నాలుగు జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 30, టీడీపీ 22 సీట్లు గెలుచుకుంది.

గత ఎన్నికల్లో 52కు 49 సీట్లు వైసీపీ గెలుచుకుంది..టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. అయితే ఈ సారి కూడా అధికారంలోకి రావాలని కష్టపడుతున్న వైసీపీ..మళ్ళీ సీమలో సత్తా చాటాలని చూస్తుంది. గతంలో మాదిరిగా కాకపోయినా..ఈ సారి ఖచ్చితంగా 40 సీట్లు అయిన గెలుచుకోవాలని వైసీపీ భావిస్తుంది. ఇప్పటికే వైసీపీ పెద్దలు..ఇటీవల సీమ నేతలతో సమావేశమై టార్గెట్ సెట్ చేసినట్లు తెలిసింది. కడపలో ఎలాగో క్లీన్ స్వీప్ చేస్తామని, కర్నూలులో 3-4, చిత్తూరులో 3-4, అనంతపురంలో 5-6 సీట్లు టీడీపీ గెలుచుకున్న, మిగిలిన సీట్లు ఖచ్చితంగా గెలుచుకుని టార్గెట్ 40 సీట్లు కొట్టాలని వైసీపీ పెద్దలు సూచించినట్లు తెలిసింది.

అయితే వైసీపీ పెద్దలు ఫిక్స్ చేసిన టార్గెట్ రీచ్ అవుతారో..రీచ్ అవ్వడానికి కాస్త ఛాన్స్ ఉంది గాని..అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సీమలో టీడీపీ 18-20 సీట్లలో బలంగా ఉందని తెలుస్తోంది. ఆ లెక్క చూసుకుంటే వైసీపీకి 32-34 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. టార్గెట్ 40 రీచ్ అవ్వడం కష్టమవుతుంది.

కాకపోతే ఒక్క అనంతపురం మినహా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కొందరు టీడీపీ నేతలు అలసత్వంతో ఉన్నారు. ఎలాగో ఈ జిల్లాల్లో వైసీపీ హవా ఉంటుంది…కాబట్టి తమ గెలుపు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో టీడీపీ గాలి ఉంటే గెలుస్తాం..లేదంటే లేదు అనే పరిస్తితుల్లో ఉన్నారు. అలాంటి వారికి వైసీపీకి ఈజీగా చెక్ పెట్టొచ్చు. అలా కాకుండా వారు గాని బలపడితే సీమలో వైసీపీకి రిస్క్ పెరుగుతుంది.