మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రజినీకాంత్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..!

తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో సూపర్ హిట్‌లు అవుతున్న క్రమంలో.. పాన్ ఇండియా హీరోలు.. డైరెక్టర్లు టాలీవుడ్ పై ఫోకస్ పెంచారు. తెలుగు సినిమాలను చాలా చీప్ గా చూసే కోలీవుడ్ -బాలీవుడ్ సినీ జనాలు కూడా టాలీవుడ్ సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఇక్కడ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ -కోలీవుడ్ డైరెక్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అవుతున్నట్టు తెలుస్తుంది.

Chiranjeevi finishes 43 years as an actor, thanks audience

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో రెండు సినిమాలు తీసారు. త్వరలోనే ఆయనతో మరో సినిమా చేయబోతున్నారని కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు శంకర్ రామ్ చరణ్ సినిమాకి స్టోరీ అందిస్తున్నాడు.

కార్తిక్ సుబ్బరాజతో చిరంజీవి సినిమా..? మనసులో మాట బయటపెట్టిన యంగ్ డైరెక్టర్

రామ్ చరణ్.. శంకర్ మూవీ తర్వాత తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఓ మూవీ కమిట్ అయ్యాడని తెలుస్తుంది. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు కూడా చిరంజీవితో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా చేయడం తన డ్రీమ్ అని కార్తీక్ చెప్పాడు. దీని బట్టి త్వరలోనే చిరంజీవితో కార్తీక్ సుబ్బరాజు సినిమా ఉంటుందని మనకు తెలుస్తుంది. దీని బట్టి చూస్తే మ‌రో పాన్ ఇండియా సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.