ఉప్పెన ముద్దుగుమ్మ కృతి శెట్టి తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తర్వాత వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ముద్దుగుమ్మ తమిళ్, మలయాళం కూడా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉంది.
కృతి శెట్టి తాజాగా నటించిన సినిమాలు ఆమెకు కొంత నిరాశనే మిగిల్చాయి. రీసెంట్ గా నటించిన మూడు సినిమాలు తెలుగులో అట్టర్ ప్లాఫ్ సినిమాలు గా మిగిలిపోయాయి. దీంతో ప్రస్తుత్తం తన ఆశలు కోలీవుడ్ లో సూర్య తో నటిస్తున్న సినిమాల పైనే పెట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి మరో షాకింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.
ఆ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా నుంచి కృతి శెట్టి ని తొలగించారని తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచడమే కారణమని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కృతిని సూర్య సినిమా నుంచి తీసేసారని తెలియడంతో ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోడింగ్ నడుస్తుంది. ఆమెకు దూల తీరింది తిక్క కుదిరింది అంటూ.. ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.