అవకాశాలు లేక బ్రోకర్ గా మారిపోయిన సెన్షేషనల్ హీరోయిన్?

సినిమా పరిశ్రమలో రాణించడం అంటే మామ్మూలు విషయం కాదు. అందులోనూ హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎదగడానికి. కొత్త తరం హీరోయిన్ వచ్చిందంటే ఇక్కడ సీనియర్లకు అవకాశాలు కనుమరుగవుతాయి. అలాగే ఇక్కడ రాణించాలంటే నటనతో పాటు సరైన పాత్రలు ఎంపిక అనేది చాలా ముఖ్యంగా. ఒక్క హిట్ తో కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు.

అలాంటివారిని ఒకసారి చూస్తే గనుక… ‘RX 100 ‘ సినిమాతో పాయల్ రాజపుట్ ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆరేంజ్ హిట్ లేక ఇబ్బంది పడుతోంది. ఏకోవలోకి చేరిన మరో నటి పేరు షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో షాలినీ పాండే జాతకం ఒక్కసారిగా మారిపోయిందని అందరు అనుకున్నారు. కానీ కట్ చేస్తే అమ్మడు ఖాతాలో ఆ సినిమా తప్ప ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. తెలుగులో అనుకున్నంత సక్సెస్ లేకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది షాలిని.

ఇక తాజా సమాచారం ప్రకారం షాలిని పాండే ఓ క్రేజీ రోల్ ను అక్కడ యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో షాలిని ఓ బ్రోకర్ పాత్రని చేస్తోందట. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె బ్రోకర్ గా తన దగ్గరకు వచ్చిన మగాళ్ళను ఎలా సుఖపెట్టాలి అని తోటి వేశ్యలతో చెబుతుందట. అవకాశాలకోసం వేయికళ్లతో ఎదురు చుసిన షాలిని ఈ పాత్ర బాగా నచ్చేసిందట. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి మరొక మంచి అవకాశం వచ్చిందని, ఈసారి ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ కొట్టి కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలని అమ్మడు యోచిస్తోందట.