సమంత – చరణ్ విషయంలో జరిగిందేమిటి? ఉపాసన ఎందుకు తిట్టింది?

సమంత గురించి పరిచయం అక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం అమ్మడు జీవితం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ 2 సినిమాతో సామ్ ఒక్కసారిగా బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంతని మరోమెట్టు మీద అలంకరించింది. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రంగస్థలం సినిమా కొనియాడలేనిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ సినిమాలో సమంత రామ్ చరణ్ కి కిస్ ఇచ్చే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ నిజంగా చేయకుండా డమ్మీ గా క్రియేట్ చేద్దామని డైరెక్టర్ చెప్పారట. కానీ షాట్ రెడీ అయింది అని దర్శకుడు చెప్పగానే సమంత కిస్ ఇచ్చేసిందట. ఇక ఈ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు డైరెక్టర్ సుకుమార్ సమంత దగ్గరకు వెళ్లి యాక్షన్ అనగానే నువ్వు చరణ్ కి డైరెక్ట్ గా లిప్ లాక్ పెట్టేయాలి అని అన్నారట. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఉపాసన చరణ్ కి పెళ్లి కి ముందే ఓ కండిషన్ పెట్టిందట. పెళ్లి తర్వాత ఇలాంటి డైరెక్ట్ లిప్ లాక్ లకు చాలా దూరంగా ఉండమని. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా చరణ్ ఆ సీన్ కి ఓకే చెప్పేశాడట.

ఈ విషయంలో ఉపాసన అప్పట్లో చాలా బాధ పడిందని సమాచారం. దానికి రాంచరణ్ కూడా ఫీల్ అయ్యాడట. ఇక దీంతో చిరంజీవి కల్పించుకొని డైరెక్టర్ సుకుమార్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. అంతే కాదు అంత పెద్ద స్టార్ డైరెక్టర్ చేత తన కోడలు పిల్లకు సారీ కూడా చెప్పించాడట మన మెగాస్టార్. దాంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది. లేదంటే విడాకుల వరకు పోయేదట మరి. ఇక అప్పటి నుండి రామ్ చరణ్ తన స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇలాంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పాలి అంటూ డైరెక్టర్లకు ముందుగానే చరణ్ సూచిస్తాడట.