ల‌క్ అంటే శ్రీ‌లీల‌దే.. బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిందిగా!

యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులో పెరిగింది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ను ప్రారంభించిన బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ కు జోడీగా `ధమాకా` చిత్రంలో నటిస్తోంది. అలాగే నితిన్ తో కలిసి `జూనియర్` అనే మూవీ చేస్తోంది. వీటితోపాటు నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్ బీకే 108 లో ఓ కీలక పాత్రను పోషించబోతున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఆఫర్ ను అందుకుందని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మొదట సాక్షి వైద్య హీరోయిన్ గా తీసుకోవాలని బోయపాటి భావించారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని ఆమె స్థానంలో శ్రీలీలను ఎంపిక చేశారట.

 

రామ్ ఎనర్జీకి ఆమె కరెక్ట్ గా సూట్ అవుతుందని బోయపాటి భావిస్తున్నారట. అందుకే శ్రీలీలతో సంప్రదింపులు జరిపి ఆమెనే ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 న శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నట్లు అధికారికంగా సైతం అనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో లక్ అంటే శ్రీ లీలదే.. ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆఫర్ కొట్టేసింది.. అంటూ ఆమెను నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.